నైపుణ్యం నాస్తి | no skills to engineering students | Sakshi
Sakshi News home page

నైపుణ్యం నాస్తి

Published Wed, Jan 8 2014 5:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

no skills to engineering students

సాక్షి, మంచిర్యాల : నిరుద్యోగ యువతలో నైరాశ్యం పెరుగుతోంది. జిల్లాలో వృత్తి విద్య కాలేజీల్లో చదివి కొలువుల వేటలో ఉన్నవారికి నిరాశే మిగులుతోంది. తాము చదివిన చదువుకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా యు వ ఇంజినీర్లు మానసిక వేదనకు గురవుతున్నారు. జిల్లాయేతర కార్పొరేట్  కాలేజీల్లో చదివిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నా యి. కానీ మన జిల్లాలో కనీస విద్యా ప్రమాణాలు లేకపోవడం, ఉపాధి కోసం ఏ కంపెనీకి వెళ్లినా నైపుణ్యం, సీనియార్టీ తప్పనిసరనే నిబంధన ఉండడంతో జిల్లాకు చెందిన నిరుద్యోగులు కొలువులు సాధించలేక పోతున్నారు.

 దీంతో కొందరు సీనియార్టీ కోసం చిన్న కంపెనీల్లో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. చివర కు గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ఉన్నా.. వృ త్తి విద్యా కోర్సులతోపాటు వివిధ రకాల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్లు తప్పనిసరి అయ్యాయి. దీంతో జిల్లాకు చెందిన కొందరు యువకులు ఆ కోర్సుల కోసం హైదరాబాద్‌లో మకాం వేశారు. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు అధికంగా ఉండటం, కంపెనీల ఏర్పాటు లేకపోవడతో ఉపాధి అవకాశాలు లభించడం లేదు. కాగా, ఏటా జిల్లాలోని వృత్తి విద్యా కాలేజీల్లో వేలాది మంది వివిధ కోర్సులు పూర్తి చేస్తున్నారు.

 బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన వాళ్లు మల్టీనేషన్ కంపెనీల వైపు.. పాలిటెక్నిక్, ఐటీఐ, సంబంధిత కోర్సులు చదివిన విద్యార్థులు పరిశ్రమలు.. నర్సింగ్, ఎంఎల్‌టీ కోర్సులు చేసిన వారు ఆస్పత్రుల వైపు.. బీఈడీ, డీఎడ్ చదివిన వారు స్కూళ్లలో బోధకులుగా మారుతున్నారు. వీరికి ఉద్యోగాన్వేషణ కోసం ఎక్కడికి వె ళ్లినా చుక్కెదురవుతోంది.

 విద్యాప్రమాణాలు హుష్‌కాకి
 జిల్లాలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండడంతో ఆయా రంగాల్లో నైపుణ్యత లేక విద్యార్థులు కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించలేకపోతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ కొరత ఉంది. పూర్వ విద్యార్థులే ఆయా కాలేజీల్లో ప్రొఫెసర్లుగా వ్యవహరిస్తున్నారు. అనుభవజ్ఞులను తీసుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని యాజమాన్యాలు తమ కాలేజీల్లో చదివిన విద్యార్థులనే బోధకులుగా నియమించుకుంటున్నారు. కొన్ని బ్రాంచీల్లో ఆధునాతక ల్యాబ్‌లు లేవు.


 ఇంకొన్ని బ్రాంచీలకు అసలు ల్యాబ్‌లు లేక విద్యార్థులు మౌఖిక బోధన తోనే చదువులు ముగించేస్తున్నారు. ప్రయోగాలు లేక, పరిశోధనాత్మక విద్య అందక విద్యార్థులు చదువులు ముగించేస్తున్నారు. విద్యా ప్రమాణాలు నామమాత్రంగా ఉండడం.. సీనియార్టీ లేకపోవడంతో ఇంజినీరింగ్, ఎంబీఏ చదివిన విద్యార్థులు కనీసం గల్ఫ్‌కు వెళ్లాలన్నా వెళ్లలేకపోతున్నారు. దీంతో కష్టపడి చదివిన చదువుతోపాటు పలు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసుకుని బయటి దేశాలకు వెళ్తున్నారు. కేవలం మంచిర్యాలలోనే సుమారు 40 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గత విద్యా సంవత్సరం చదువులు ముగించుకుని హైదరాబాద్‌లో వివిధ కోర్సులు చేస్తున్నారు.

ఇటు పారమెడికల్ కాలేజీల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. కాలేజీల్లో ప్రయోగశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. వారంలో కనీసం ఒక సారైనా ల్యాబ్ నిర్వహించాల్సి ఉన్నా.. పలు పారమెడికల్ కాలేజీ యాజమాన్యాలు నెలకోసారి నిర్వహించి చేతులు దులుపుకుంటున్నాయి. తీరా చదువు ముగించుకుని ఏడాదిపాటు శిక్షణకాలం కోసం ఆస్పత్రులు, ల్యాబ్‌లకు వెళ్లిన పారామెడికల్ సిబ్బంది కనీస పరిజ్ఞానం లేక ఇబ్బందులు పడుతున్నారు.

 ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ) కాలేజీల్లోనూ అనుభవజ్ఞులైన ఇన్‌స్ట్రక్టర్లు లేరు. దీంతో చాలా చోట్ల విద్యార్థులు కాలేజీల వైపు కన్నెత్తి చూడడం లేదు. పాస్ అయితే చాలు అనే ఉద్దేశంతో పరీక్షల సమయంలో మాత్రమే హాజరవుతున్నారు. ఇదే పరిజ్ఞానంతో అప్రంటీస్ (శిక్షణ) కోసం పరిశ్రమల్లో వెళ్లిన అభ్యర్థులను తీసుకునేందుకు యాజమాన్యాలు ఇష్టపడడం లేదు. ఒకవేళ తీసుకున్నా.. వారి కోర్సులకు తగట్టు శిక్షణ ఇవ్వడం లేదు. దీంతో అప్రంటీస్ సర్టిఫికెట్ ఉన్నా.. నైపుణ్యం లేక కంపెనీల్లో ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement