అనంతపురం: రోజురోజుకూ పెరిగిపోతున్న మట్కా జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివరాలు...అనంతపురం జిల్లా ఉరవకొండలో పక్కా వ్యూహంతో మట్కాస్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారినుంచి రూ. 1.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.