‘ఖాకీ’ల కర్కశం | police torturing murder suspect in eastgodavari district | Sakshi
Sakshi News home page

‘ఖాకీ’ల కర్కశం

Published Mon, Dec 23 2013 2:57 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

‘ఖాకీ’ల కర్కశం - Sakshi

‘ఖాకీ’ల కర్కశం

 హత్య కేసులో అనుమానితుడికి చిత్రహింసలు
 దెబ్బతిన్న కిడ్నీలు, పరిస్థితి విషమం
 కాకినాడ, న్యూస్‌లైన్: హత్య చేశాడనే అనుమానంతో అదుపులో తీసుకున్న నిందితుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టి, అతడి ప్రాణాలకే ముప్పు వాటిల్లే స్థితి తెచ్చిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపర్తికి చెందిన తాతారావు గతనెల 12న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పప్పుదినుసుల వ్యాపారైన గారపాటి శ్రీనివాస్‌తో పాటు పలువురిని ఈనెల 13న అదుపులోకి తీసుకున్నారు.  రోజూ స్టేషన్‌కు పిలిపించి ‘తమదైన శైలి’లో లో విచారించారు. శనివారం రాత్రి విచారణ సమయంలోశ్రీనివాస్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో పోలీసులు ఇంటి వద్ద వదిలేసి, అతని భార్య సూర్యచక్రవేణికి రూ.2 వేలిచ్చారు. ఆదివారం ఉదయానికి శ్రీనివాస్ ఒళ్లంతా ఉబ్బి మూత్రం రాకపోవడంతో బంధువులు కాకినాడ ప్రభుత్వాస్ప్రత్రికి తరలించారు. అతడి కిడ్నీలు పూర్తిగా దెబ్బ తిన్నాయని వైద్యులు చెప్పడంతో లబోదిబోమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement