పాతపట్నం: అడవి నుంచి తప్పిపోయి జనారణ్యంలోకి వచ్చిన ఓ చుక్కల (కృష్ణజింక)జింకను పాతపట్నం ఆల్ ఆంధ్రా రోడ్డు వద్ద కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు దాహార్తి తీర్చుకోవడానికి జోగికొండ దిగువకు రావడంతో కుక్కలు చూసి వెంబడించడంతో స్థానికులు చూసి, కుక్కలను తరిమికోట్టారు. అప్పటికే జింకకు మెడపై, కాళ్లకు గాయాలున్నాయి. ప్రాణాలతో ఉండడంతో అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి జింకను ఆటోలో తమ కార్యాలయానికి తీసుకు వెళ్లి వైద్యం అందించారు.
అయితే ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అటవీ శాఖ రేంజర్ ఎం.వి.ఎస్ సోమశేఖర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ కార్యాలయం సమీపంలో జింకను పశుశాఖ ఏడీ ఎం.రవికృష్ణ పంచనామా చేసి, పోస్టుమార్టం అనంతరం ఖననం చేశామని ఫారెస్టు సెక్షన్ అధికారి బి.రామమూర్తి తెలిపారు. పారెస్టు బీట్ అధికారి జి.కృష్ణప్రసాద్, గార్డు ఎస్.కృష్ణారావు పాల్గొన్నారు.
కుక్కల దాడిలో చుక్కల జింక మృతి
Published Fri, Nov 6 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement