టుడే న్యూస్‌ రౌండప్‌ | today news rounup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Fri, Oct 27 2017 6:06 PM | Last Updated on Fri, Oct 27 2017 6:17 PM

today news rounup

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరిస్తూ దేశ ప్రథమ పౌరుడికి లేఖ పంపారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని సవివరంగా లేఖలో వివరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే అసెంబ్లీ స్పీకర్‌, శాసనమండలి చైర్మన్ నుంచి స్పందన రాలేదని తెలిపారు.

-------------------------------- రాష్ట్రీయం--------------------------------------

రాష్ట్రపతికి వైఎస్‌ జగన్‌ లేఖ
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు.

వాళ్లకు పదవులిచ్చి బాబు తప్పుచేశారు : శ్రీకాంత్‌రెడ్డి
ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తామంతా నిర్ణయించుకున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

 నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా
ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సవాల్‌ విసిరారు. 

చంద్రబాబుతో రేవంత్‌ ఏకాంత భేటీ
తెలంగాణ టీడీపీలో రేవంత్‌ రెడ్డి పంచాయితీ ఎట్టకేలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది.

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే మొదలైన కొద్ది సేపటికే సభలో గందరగోళం నెలకొంది.

------------------------------------------- జాతీయం --------------------------------------------

జయ మరణంపై విచారణకు రిటైర్డ్‌ జడ్జి నియామకం
మ్మ మరణంపై నిజాలు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకరించిన విషయం తెలిసిందే.

మంత్రి సెక్స్‌ సీడీ కలకలం.. జర్నలిస్ట్‌ అరెస్ట్‌
ఛత్తీస్‌గఢ్‌లో మరో రాసలీలల కుంభకోణం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ప్రభుత్వంలోని మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. 

ఉత్సవం కోసం ఎయిర్‌పోర్ట్‌ మూసివేత
ఆలయంలో జరిగే ఉత్సవం కోసం ఎయిర్‌పోర్టును మూసేయటం ఎక్కడైనా చూశారా? అయితే ఇలా ఓ ఈవెంట్ కోసం ఎయిర్ పోర్టును మూసేయడం తరచుగా జరిగేది మరెక్కడో కాదు కేరళలో.

------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------

‘ఉత్తర కొరియా కంటే పాకిస్తానే ప్రమాదకారి’
ఉత్తర కొరియా కంటే పాకిస్తానే అత్యంత ప్రమాదకారి అని.. అమెరికా మాజీ సెనెటర్‌ ఒకరు హెచ్చరించారు.

కెనడీ హత్య ఫైల్స్‌ విడుదల
అమెరికానేకాక మొత్తం ప్రపంచాన్నే కుదిపేసిన అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ హత్యోదంతం ఫైళ్లను అమెరికా తొలిసారి బహిర్గం చేసింది.

డబ్బు కోసం భారత బిలియనీర్‌ ఏం చేశాడంటే...
భారత అమెరకన్‌ ఫార్మా బిలియనీర్‌ జాన్‌ నాథ్‌ కపూర్‌ (74)ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

------------------------------------------- సినిమా --------------------------------------------

మెర్సల్‌ బ్యాన్‌ పిటిషన్‌​ కొట్టివేత
మెర్సల్‌ సినిమా మేకర్లకు పెద్ద ఊరట లభించింది. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది.

ఆ మూవీకి రవితేజ 'ఫిదా'!
'రాజా ది గ్రేట్' మూవీతో మరో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఓ బాలీవుడ్ మూవీని ప్రశంసల్లో ముంచెత్తారు.

'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ రివ్యూ
నేను శైలజ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో రామ్, తరువాత హైపర్ తో మరోసారి తడబడ్డాడు.

 ------------------------------------------- క్రీడలు --------------------------------------------

డోప్ టెస్టులో దొరికిన భారత క్రికెటర్!
భారత క్రికెటర్ ఒకరు డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తాజాగా స్సష్టం చేసింది.

అవన్నీ రూమర్లే: రాహుల్ ద్రవిడ్
 టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి కావాలని అడిగితే దాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తిరస్కరించిందంటూ వచ్చిన వార్తలను మాజీ కెప్టెన్, భారత జూనియర్, 'ఎ' జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు.

స్మిత్.. కెమెరాలు కనిపెడతాయి జాగ్రత్త!
త్వరలో స్వదేశంలో ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఆ దేశ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా పలు సూచనలు చేశాడు.

 ------------------------------------------- బిజినెస్‌ --------------------------------------------

భారీగా క్షీణించిన ఐసీఐసీ బ్యాంక్‌ లాభం
మూడవఅతిపెద్ద ప్రయివేటు  బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్  క్యూ2 ఫలితాల్లో చతికిలపడింది. 

ఫ్లాట్‌గానే..అయినా ఓకే
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.  తీవ్ర ఒడిదుడుకుల మధ్య  సాగిన  బ్యాంక్‌ నిఫ్టీ   కూడా ఫ్లాట్‌గానే ముగిసింది.

అద్భుత ఫీచర్లు..బడ్జెట్‌ ధర: కొత్త ట్యాబ్‌  
స్వైప్ టెక్నాలజీస్  బడ్జెట్‌ ధరలో ట్యాబ్‌ను  లాంచ్‌  చేసింది. భారీ బ్యాటరీ సామర్ధ్యం, 16జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, 4జీ వోల్ట్‌   ప్రధాన ఫీచర్లుగా  స్వైప్‌ స్లేట్‌  ప్రొ పేరుతో  దీన్ని మార్కెట్లో విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement