
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడింది. సమ్మెను విరమించినట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. పౌరసత్వం విషయంలో టీఆర్‌ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాల్తేరు రైల్వే డివిజన్‌ను విశాఖపట్నంలోనే కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో సరైన సమయంలో ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారంలో రాజ్యసభలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం సమావేశమయ్యారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment