వైఎస్‌ జగన్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు | YS Jagan's Independence Day greetings | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Published Wed, Aug 15 2018 2:56 AM | Last Updated on Wed, Aug 15 2018 7:05 AM

YS Jagan's Independence Day greetings - Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు  72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా.. 1947, ఆగస్టు 15న ఆనాటి ప్రధాని నెహ్రూ తన ప్రసంగం ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’లో మహాత్మాగాంధీ ఆకాంక్ష గురించి ప్రస్తావించిన మాటలను గుర్తు చేశారు.  

 ‘దేశానికి సేవ చేయడం అంటే.. దేశంలో కోట్ల మందికి సేవ చేయడమే. దీని అర్థం.. పేదరికాన్ని, అజ్ఞానాన్ని, ఆరోగ్యపరంగా పీడిస్తున్న రకరకాల వ్యాధులను, అవకాశాల్లో అసమానతలను రూపుమాపకుండా దేశానికి సేవ చేశామంటే అర్థం లేదు. దేశంలో అశక్తులైన ప్రజలందరి కంటి నుంచి రాలే ప్రతి కన్నీటి బొట్టునూ తుడిచే అన్ని ప్రయత్నాల్నీ మనమంతా ప్రయత్నలోపం లేకుండా చేయాలన్నదే మహాత్ముడి ఆకాంక్ష.

ఈ పని చేయడం మన శక్తికి మించినదే కావచ్చు. కానీ అశక్తుల కన్నీరు, వారి కష్టాలూ అలాగే ఉన్నంతకాలం.. మనం చేయాల్సిన పనిని చేయనట్టుగానే భావించాల్సి ఉంటుంది’’. 5 ఏళ్ల 3 నెలల వైఎస్సార్‌ పాలనకు, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలకు, తమ పార్టీ ఆవిర్భావానికి, పార్టీ వేస్తున్న ప్రతి అడుగుకూ ఆ మాటలే మార్గదర్శకాలని వైఎస్‌ జగన్‌ తెలిపారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement