సాఫ్ట్ వేర్ టెస్టింగ్ సర్వీసుల్లో సిగ్నిటి హవా
హైదరాబాద్: గ్లోబల్ బీపీవో, ఐటీ ఔట్సోర్సింగ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ ‘నెల్సన్హాల్’.. సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్‌కు సంబంధించి ఇటీవల రూపొందించిన నివేదిక ప్రకారం ‘సిగ్నిటి టెక్నాలజీస్’ ప్యూర్-ప్లే మార్కెట్ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే డిజిటల్, కన్సల్టింగ్ వంటి మార్కెట్ విభాగాల్లోనూ టాప్‌లో నిలిచినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల పరంగా చూస్తే.. రెండో అతిపెద్ద ప్యూర్-ప్లే సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీగా ఆవిర్భవించామని పేర్కొంది.