డిగ్జామ్ నుంచి వింటర్ 2015 కలెక్షన్
హైదరాబాద్: వస్త్ర తయారీలో ఉన్న ప్రముఖ కంపెనీ డిగ్జామ్ వింటర్ 2015 కలెక్షన్‌ను సోమవారమిక్కడ ఆవిష్కరించింది. సెలెబ్రేషన్ కలెక్షన్, కింగ్స్ చాయిస్ జాకెటింగ్, ప్లాటినమ్‌లైన్, సిగ్నేచర్ కలెక్షన్ వీటిలో ఉన్నాయి. అత్యంత నాణ్యమైన వస్త్రాలను నూతన శైలిలో, ఆకట్టుకునే రంగుల్లో తయారు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. జాకెటింగ్ ఫ్యాషన్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా నిలిచినట్టు తెలిపింది. కంపెనీకి దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా డీలర్లు ఉన్నారు. భారత్‌లో 32 ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లు నిర్వహిస్తున్నట్టు డిగ్జామ్ ఎండీ సి.భాస్కర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. బ్రాండ్‌కు మంచి ఆదరణ ఉందని చెప్పారు. ఎస్.కె.బిర్లా గ్రూప్ కంపెనీ అయిన డిగ్జామ్‌కు ఏటా 50 లక్షల మీటర్లకుపైగా వస్త్రాలను తయారు చేసే సామర్థ్యం ఉంది.