డ్యూక్ ఫ్యాషన్స్ సమ్మర్ కలెక్షన్-16
హైదరాబాద్: డ్యూక్ ఫ్యాషన్స్ ఇండియా తాజాగా ‘సమ్మర్ కలెక్షన్-16’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ డిజైన్లతో కూడిన పలు టీ-షర్ట్స్, షర్ట్స్, లోయర్స్, టాప్స్, డెనిమ్స్, ఫుట్‌వేర్, వాల్యూ ప్యాక్స్ వంటి తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీటి ధర రూ.425 నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. నాణ్యత, డిజైన్లలో ఎప్పుడూ ముం దుండే తాము సమ్మర్ కలెక్షన్స్‌ను ప్రత్యేకంగా భారతీయ వాతావరణ పరిస్థితులకు అనువుగా రూపొందించామనిడ్యూక్ ఫ్యాషన్స్ డెరైక్టర్ కుంతల్ రాజ్ జైన్ తెలిపారు.