Duke Fashions
-
డ్యూక్ ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-2016
హైదరాబాద్: డ్యూక్ ఫ్యాషన్స్ ఇండియా తాజాగా ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-16ను ఆవిష్కరించింది. ఇందులో వివిధ డిజైన్లు, కలర్స్, సైజ్‌లలో ఉన్న రిలాక్స్డ్ ఆఫీస్ వియర్స్, వీకెండ్ క్యాజువల్ వియర్స్ ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కలెక్షన్లోని ఫార్మల్ ట్రౌజర్స్, షర్ట్స్, కాటన్ షర్ట్స్‌లో స్టైల్తోపాటు లగ్జరీ కూడా ఉట్టిపడుతుందని పేర్కొంది. వీటి ధర రూ.595 నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. ఇవి డ్యూక్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, ప్రముఖ మల్టీ బ్రాండెడ్ ఔట్లెట్స్లలోనూ అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
డ్యూక్ ఫ్యాషన్స్ సమ్మర్ కలెక్షన్-16
హైదరాబాద్: డ్యూక్ ఫ్యాషన్స్ ఇండియా తాజాగా ‘సమ్మర్ కలెక్షన్-16’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ డిజైన్లతో కూడిన పలు టీ-షర్ట్స్, షర్ట్స్, లోయర్స్, టాప్స్, డెనిమ్స్, ఫుట్‌వేర్, వాల్యూ ప్యాక్స్ వంటి తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీటి ధర రూ.425 నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. నాణ్యత, డిజైన్లలో ఎప్పుడూ ముం దుండే తాము సమ్మర్ కలెక్షన్స్‌ను ప్రత్యేకంగా భారతీయ వాతావరణ పరిస్థితులకు అనువుగా రూపొందించామనిడ్యూక్ ఫ్యాషన్స్ డెరైక్టర్ కుంతల్ రాజ్ జైన్ తెలిపారు. -
డ్యూక్ ఫ్యాషన్స్ ‘థర్మల్ వేర్ కలెక్షన్’
హైదరాబాద్: చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని.. డ్యూక్ ఫ్యాషన్స్ (ఇండియా) ‘థర్మల్ వేర్ కలెక్షన్’ను ఏర్పాటు చేసింది. ఇం దులో అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, తాజా మార్కెట్ ట్రెండ్‌కు తగినట్లుగా రూపొందించిన థర్మల్స్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. నాలుగు రంగుల్లో లభ్యమయ్యే ఈ థర్మల్స్ ధర రూ.185-రూ.740 మధ్యలో ఉంటుందని తెలిపింది. స్పెషల్ హాలో ఫైబర్‌తో కూడిన థర్మల్ ఇన్సులేషన్ టెక్నాలజీతో రూపొందించిన థర్మల్స్ శరీరాన్ని చల్లని వాతావరణంలో కూడా వెచ్చగా ఉండేలా చేస్తాయని వివరించింది. ‘తమ టార్గెట్ క స్టమర్లు యువత. నాణ్యతతో కూడిన అంతర్జాతీయ డిజైన్లతో వారికి చేరువకావడమే తమ లక్ష్యం’ అని డ్యూక్ ఫ్యాషన్స్ డెరైక్టర్ కుంతల్ రాజ్ జైన్ తెలిపారు.