హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్గా 2015-16 సంవత్సరానికిగాను గౌర గ్రూప్ ఎండీ గౌర శ్రీనివాస్ నియమితులయ్యారు. ఫ్యాప్సీతో ఆయనకు 10 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. అర్బన్ ఇన్ఫ్రా, టూరిజం, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర కమిటీలకు చైర్మన్, కో-చైర్మన్గా వ్యవహరించారు. వైస్ ప్రెసిడెంట్ను తదుపరి సంవత్సరానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాతి ఏడాదికి ప్రెసిడెంట్గా నియమించడం ఫ్యాప్సీలో ఆనవాయితీగా వస్తోంది.