కాంపాక్ట్ సెడాన్ కార్ల హవా | Honda-Tougher-Compact-Car | Sakshi
Sakshi News home page

కాంపాక్ట్ సెడాన్ కార్ల హవా

Published Sat, Aug 23 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

Honda-Tougher-Compact-Car

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంపాక్ట్ సెడాన్ కార్లకు దేశంలో డిమాండ్ పెరుగుతోందని టాటా మోటార్స్ తెలిపింది. 2013-14లో ఈ విభాగం 7 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15-17 శాతం వృద్ధి అంచనాలు ఉన్నాయని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన విభాగం నేషనల్ సేల్స్ హెడ్(సౌత్, ఈస్ట్) ఆశీష్ ధార్ తెలిపారు. కాంపాక్ట్ సెడాన్ కారు జెస్ట్‌ను హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ హెడ్ రాజలక్ష్మి విజయ్, దక్షిణప్రాంత మేనేజర్ నకుల్ గుప్తాతో కలసి మీడియాతో మాట్లాడారు. భారత్‌లో కాంపాక్ట్ సెడాన్ కార్లు నెలకు 50 వేలు అమ్ముడవుతున్నాయని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 3 వేలుందని వివరించారు. వాహన పరిశ్రమ 2013-14లో 5 శాతం తిరోగమన వృద్ధి చెందింది.

 ఈ ఏడాదే బోల్ట్..
 టాటా హ్యాచ్‌బ్యాక్ కారు బోల్ట్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే రానుందని ఆశిష్ తెలిపారు. ఏటా 2  కొత్త మోడళ్లను తేవాలన్నది టాటా మోటార్స్ లక్ష్యమని చెప్పారు. డిమాండ్ ఉన్న పాత మోడళ్ల తయారీని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో 29 ఫీచర్లను తొలిసారిగా జెస్ట్ కారులో పరిచయం చేశామని తెలిపారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌కు డిజైన్ చేశామని, మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెయిటింగ్ పీరియడ్ 30-60 రోజులుందని చెప్పారు.

Advertisement
Advertisement