భారత్ విదేశీ రుణ భారం 456 బిలియన్ డాలర్లు | India's external debt stood at USD 455.9 bn | Sakshi
Sakshi News home page

భారత్ విదేశీ రుణ భారం 456 బిలియన్ డాలర్లు

Published Thu, Jan 1 2015 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

భారత్ విదేశీ రుణ భారం 456 బిలియన్ డాలర్లు

భారత్ విదేశీ రుణ భారం 456 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 456 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మార్చి స్థాయితో పోల్చిచూస్తే ఈ పరిమాణం 3.1 శాతం (13.7 బిలియన్ డాలర్లు) పెరిగింది. మొత్తం రుణాన్ని పలు విభాగాల్లో చూస్తే, దీర్ఘకాలిక రుణం మార్చితో పోల్చితే 4.7% పెరిగి, 369.5 బిలియన్ డాలర్లుగా ఉంది.  స్వల్పకాలిక రుణ భారం 3.2% తగ్గి, 86.4 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) డిపాజిట్లు ఎగయడం విదేశీ రుణ పరిమాణం పెరుగుదలకు కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

మొత్తం విదేశీ రుణంలో వాణిజ్య రుణాల పరిమాణం అత్యధికంగా 35.4%గా ఉంది. తరువాత ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు 23.8%గా ఉన్నాయి. ఇతర రుణాలు 11.7%గా ఉన్నాయి. కాగా దేశాభివృద్ధికి సంబంధించి కేంద్రం విదేశీ కరెన్సీలో జారీ చేసే బాండ్లకు సంబంధించిన ‘సావరిన్ ఎక్స్‌టర్నల్ డెట్’ సెప్టెంబర్‌లో 88.4 బిలియన్ డాలర్లులుగా ఉంది. మార్చి 2014లో ఈ మొత్తం 81.5 బిలియన్ డాలర్లు.

Advertisement
Advertisement