న్యూఢిల్లీ: ఇటలీలో రెండో అతి పెద్ద ఉక్కు సంస్థ అఫెర్పిని దేశీ ఉక్కు దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం అఫెర్పీ మాతృసంస్థ, అల్జీరియాకి చెందిన సెవిటాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ. 600 కోట్లు ఉండొచ్చని అంచనా. గతంలోనూ దీన్ని కొనుగోలు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రయత్నించింది.
అప్పట్లో లుషినిగా పేరొందిన ఈ సంస్థను 2014లో సెవిటాల్ కొనుగోలు చేసి.. అఫెర్పిగా పేరు మార్చింది. తాజాగా దీన్నే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఇప్పుడు ఎట్టకేలకు దక్కించుకుంటోంది. స్ప్రింగ్‌లు, రైల్వే అవసరాల కోసం రైల్స్, వైర్ రాడ్స్ మొదలైన వాటికి ఉపయోగపడే ప్రత్యేక తరహా ఉక్కును అఫెర్పి తయారు చేస్తుంది. ప్రస్తుతం 18 మిలియన్ టన్నులుగా ఉన్న వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 40–45 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment