JSW Steel
-
భారత్‌లో ఫోర్డ్ మరో సంచలన నిర్ణయం!
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన ఫోర్డ్ కార్ల తయారీని నిలిపివేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఫోర్డ్ యాజమాన్యం ఫోర్డ్ చెన్నై ప్లాంట్‌ను ఉక్కు దిగ్గజం జే.ఎస్.డబ్ల్యూ స్టీల్‌కి అమ్మాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. భారతీయలు నాడి పసిగట్టలేక ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 తరువాత భారత్‌కు వచ్చిన తొలి అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల్లో ఫోర్డ్ ఒకటి. వందల కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టి, ఇక్కడే కార్ల తయారీ, అమ్మకాలు చేపట్టింది. అయితే, భారతీయుల నాడిని పసిగట్టడంలో విఫలమైంది. అప్పట్లో భారతీయులకు చిన్న కార్లపై మోజు ఎక్కువగా ఉండేది. ఫోర్డ్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది. చిన్న కార్లను పరిమిత సంఖ్యలో అమ్మేది. అదే సమయంలో మారుతి, హ్యుండయ్‌లతో పోటీ పడలేదకపోయింది. చేతులు కాల్చుకోవడం ఇష్టం లేకే ఫలితంగా ఫోర్డ్ మన మార్కెట్లో 2 శాతం కన్నా తక్కువ వాటానే సాధించగలిగింది. 2000 నుంచి 2021 వరకు 200 కోట్ల డాలర్ల మేర నష్టమూటగట్టుకుంది. 2020 నాటికి దేశంలో 50 లక్షల మేర ప్రయాణికుల కార్ల అమ్మకాలుంటాయని అంచనా వేస్తే, 30 లక్షలలోపునకే పరిమితమైంది. ఇంకా చేతులు కాల్చుకోవడం అర్థం లేదని 2021లో భారత్‌లో తన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్‌కు రెండు ప్లాంట్లు ఈ నేపథ్యంలో.. ఫోర్డ్‌కు భారత్‌లో రెండు కార్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. సుమారు 350 ఎకరాల్లో వాహన అసెంబ్లీ ప్లాంటు, 110 ఎకరాల్లో ఇంజిన్ల తయారు చేసేది. ఫోర్డ్ భారత మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి..సనంద్ ప్లాంట్‌ను టాటా కంపెనీకి అమ్మింది. చెన్నై ప్లాంట్‌ను జే.ఎస్.డబ్ల్యూ స్టీల్‌కి అమ్మేలా చెన్నైలో ఉన్న రెండో ప్లాంట్‌ను అమ్మేందుకు మహీంద్రా అండ్ మహీంద్రాను, తైవాన్ ఎలక్ట్రానిక్ జెయింట్ విన్‌ఫాస్ట్‌ను సంప్రదించింది. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. చివరకు ఫోర్డ్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థకు జే.ఎస్.డబ్ల్యూ మధ్య కొనుగోలు, అమ్మకాలు ఒప్పందాలు జరిగాయి. చివరికి ట్విస్ట్ ఇచ్చి చెన్నై ప్లాంట్‌ను జే.ఎస్,డబ్ల్యూకి అమ్మే డీల్ చివరి దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని విరమించుకుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. భారత్‌లో చెన్నైతో పాటు, పలు ప్రాంతాల్లో ఉద్యోగుల్ని నియమించుకుని తిరిగి కార్లను తయారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అటు ఫోర్డ్ కానీ, ఇటు జే.ఎస్.డబ్ల్యూ కానీ స్పందించలేదు. -
India-canada Row: కెనడాకు మరో భారీ ఎదురు దెబ్బ?
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దౌత్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెనడాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కెనడా తీరును తప్పుబడుతూ కెనడాలో భారత్‌కు చెందిన కంపెనీలు తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కెనడాలో తన అనుబంధ సంస్థ రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మహీంద్రా దారిలో భారత్‌లోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్ ఉక్కు తయారీ సంస్థగా పేరొందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ సంస్థ కెనడాకు చెందిన ఉక్కు కంపెనీతో కొనసాగిస్తున్న వ్యాపార సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎస్డబ్ల్యూ స్టీల్ - టెస్క్ రిసోర్సెస్ ఢీల్కు బ్రేకులు ఉక్కు తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కెనడాకు చెందిన మైనింగ్ కంపెనీ టెస్క్ రిసోర్సెస్ (Teck Resources)కు చెందిన స్టీల్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఎల్క్ వ్యాలీ రిసోర్సెస్ లిమిటెడ్‌లో 20 శాతం నుంచి 40 శాతం వాటాను కొనుగోలు చేయాలని గత నెలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ భావించారు. ఆ కొనుగోలు విలువ సుమారు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ క్రమంలో కెనడా తీరును తప్పుబడుతూ టెస్క్ కంపెనీలోని వాటాను కొనుగోలు చేసే అంశంపై జేఎస్‌డబ్ల్యూ వెనక్కి తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. దీంతో కెనడాకు వాణిజ్య పరంగా మరింత ఆర్ధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కెనడా ఆర్ధిక వ్యవస్థగా అండగా భారత్ విద్యార్ధులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కెనడాలో మొత్తం విదేశీయులు 3,21,00,340 మంది ఉన్నారు. వారిలో భారతీయ పౌరులు 5.26 శాతం మంది నివసిస్తున్నారు. పైగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువ భాగం అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులపై ఆధారపడి ఉంది. పలు నివేదికల ప్రకారం.. ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ విద్యార్థులు భారీ ఎత్తున ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు. ఆ ఫీజుల రూపంలో కెనడియన్ ఆర్థిక వ్యవస్థకు 30 బిలియన్లు అందిస్తున్నారు. ఇందులో భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజుల వాటా ఎక్కువగా ఉంది. అందువల్ల, భారతీయ విద్యార్థులు అక్కడికి వెళ్లడం మానేస్తే కెనడా మరో రూపంలో ఇబ్బందులు పడనుంది. కెనడా పౌరులకు ఇబ్బందే దానికి తోడు కెనడాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ టెక్ కంపెనీలతో మొత్తం 30 సంస్థలు కెనడాలో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ కంపెనీల వల్ల కెనడాలోని పౌరులకు ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బ తినే అవకాశం ఉందని ఆయా పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి : పాపం టెక్కీ, 2 నిమిషాలు హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది! -
సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. హెచ్డీఎఫ్సీ స్థానంలో చోటు
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్–30లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చోటు లభించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనంకానున్న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ స్థానే ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రాతినిధ్యం వహించనుంది. జూలై 13నుంచి తాజా సవరణలు అమలులోకి రానున్నట్లు ఏషియా ఇండెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఏషియా ఇండెక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈతో భాగస్వామ్యంలో సూచీల కూర్పును చేపట్టే సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ దిగ్గజాల విలీనం నేపథ్యంలో ఇతర ఇండెక్సులలోనూ సవరణలకు తెరతీసినట్లు తెలియజేసింది. వీటి ప్రకారం హెచ్డీఎఫ్సీ స్థానంలో ఎస్అండ్పీ బీఎస్ఈ–500లో జేబీఎం ఆటో కంపోనెంట్స్, బీఎస్ఈ–100లో జొమాటో, సెన్సెక్స్–50లో అపోలో హాస్పిటల్స్ ప్రాతినిధ్యం వహించనున్నాయి. -
సాకారమవుతున్న స్వప్నం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మనందరి చిరకాల స్వప్నం సాకారమౌతోంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు మన ముంగిట్లోకి రానున్నాయి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవుడి దయతో ఇవాళ వైఎస్సార్ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. పెద్ద ఎత్తున జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో, వీలైనంత తక్కువ మందితో జరపాల్సి వచ్చిందన్నారు. ‘మమ్మల్ని కూడా పిలవండని కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని అడుగుతున్నారు. కోడ్ అడ్డంకిగా ఉందన్న విషయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ప్రతి అన్నకు, తమ్ముడికి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు’ అని చెప్పారు. స్టీల్ ప్లాంట్ వస్తే ఆ ప్రాంతం ఏ విధంగా నగరంగా మారిపోతోందో గమనించామన్నారు. విశాఖపట్నం తీసుకున్నా, కర్ణాటకలోని విజయనగర్ పక్కన జిందాల్ ఫ్యాక్టరీ చూసినా, ఇతర ప్రాంతాల్లోని స్టీల్ ప్లాంట్లను గమనించినా.. ఆయా ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయనిస్తుండటం చూస్తున్నామన్నారు. ఇక్కడా అదే జరగాలి అని అప్పట్లో నాన్న గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కలలుకన్నారని, ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలని ఆలోచించారని చెప్పారు. ఆయన చనిపోయాక జిల్లాను ఏ నాయకుడూ పట్టించుకోనందున జిల్లా మొత్తం వెనుకబాటుకు గురవ్వడం మన కళ్లతో మనం చూశామన్నారు. దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. మళ్లీ ఈ ప్రాంతానికి ఒక్కొక్కటిగా పరిశ్రమలు రావడంతో మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అగ్రగామి జిందాల్ గ్రూపు – ఇక్కడ నిర్మించబోయే స్టీల్ ప్లాంట్ మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుంది. 3 మిలియన్ టన్నుల ప్లాంటును రెండు దశల్లో కట్టడానికి జిందాల్ కార్యాచరణ తయారు చేశారు. రూ.3,300 కోట్లతో మొదటి దశ పూర్తవుతుంది. ఆ తర్వాత రూ.5,500 కోట్లతో సెకండ్ ఫేజ్ మరో ఐదేళ్లలో అందుబాటులోకి వస్తుంది. మొత్తంగా రెండు దశల్లో రూ.8,800 కోట్లతో ఈ ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న స్టీల్ ప్లాంట్ వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనుంది. – జిందాల్ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ 28.5 మిలియన్న్టన్నుల స్టీల్ సామర్థ్యంతో దాదాపు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులతో స్టీల్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ 3 మిలియ¯Œన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు. – ఇది ఇక్కడితో ఆగిపోదు. బళ్లారిలో కూడా జిందాల్ గ్రూపు స్టీల్ ప్లాంట్ మొదలు పెట్టినప్పుడు 3 మిలియన్ టన్నుల సామర్థ్యం అనే చెప్పారు. ఇవాళ అది పెరుగుతూ వచ్చి.. 13 మిలియ¯Œన్ టన్నుల ప్లాంట్‌గా సామర్థ్యం పెంచుకోవడంతో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను. రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు – ఈ ప్రాంతం సముద్ర తీరానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ప్లాంట్ కోసం ఇక్కడ మిగిలి ఉన్న భూములను రూ.40 కోట్లతో కొనుగోలు చేసి.. దాదాపు 3,500 ఎకరాలు జిందాల్ ఫ్యాక్టరీకి ఇస్తున్నాం. – ఇక్కడ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీతోపాటు పక్కన అనుబంధ పరిశ్రమల వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. ఫలితంగా ఇక్కడో స్టీల్ సిటీ ఆవిర్భవిస్తుందన్న ఉద్దేశంతో గొప్పగా అడుగులు వేస్తున్నాం. ఈ ప్లాంట్‌కు సంబంధించి 67వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ.. ఏడున్నర కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు వేస్తున్నాం. ప్రొద్దుటూరు, ఎరగ్రుంట రైల్వే లైను కోసం కొత్తగా మరో పది కిలోమీటర్ల లైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. – ఈ ప్లాంట్ కోసం గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేక పైపులై¯Œన్ చేపడుతున్నాం. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం తలమంచిపట్నం సబ్స్టేషన్న్నుంచి ప్రత్యేకంగా 220 కేవీ లై¯Œన్ నిర్మిస్తున్నాం. ఇలా మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. అపారంగా ఉద్యోగావకాశాలు – జిల్లాలో ఇప్పటికే కొప్పర్తిలో 550 ఎకరాలు కేటాయించి.. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను తీసుకొచ్చాం. ఇక్కడకు దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆ 550 ఎకరాల్లో మొత్తం పరిశ్రమలు వస్తే.. మొత్తంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి. – ఇప్పటికే అక్కడ రూ.1,100 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 11,500 మందికి ఉద్యోగాలకు సంబంధించిన కార్యాచరణ కూడా వేగంగా జరుగుతోంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ పేరుతో 3,155 ఎకరాలను కేటాయించి.. అడుగులు ముందుకు వేస్తున్నాం. అక్కడ రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాలు సృష్టిస్తున్నాం. తద్వారా అపారంగా.. 1.75 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. – చదువుకున్న ప్రతి పిల్లాడికి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు రావాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అత్యంత అనుకూలం – గడిచిన మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నంబర్ వ¯Œన్ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. 2019 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చే ముందు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్ స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నాం. – 2021–22లో 11.43 శాతం గ్రోత్ రేటుతో ఏపీ దేశంలోనే వేగవంతమైన గ్రోత్ రేటు గల రాష్ట్రంగా కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ రెండు అంశాల ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఎంత అనుకూలమో స్పష్టంగా తెలుస్తోంది. – మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఇక్కడకు వస్తున్న పెట్టుబడులను మనసారా ఆహ్వానిస్తూ.. పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను. అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఈ జిల్లా ముఖచిత్రం మారిపోనుంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ఆశ కల్పించిన సజ్జన్ జిందాల్‌కు ధన్యవాదాలు. రూ.8,800 కోట్ల పెట్టుబడితో ఆగిపోకుండా మిగిలిన గ్రీన్ హైడ్రోజన్, సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల దిశగా కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాం. ఈ రంగంలో దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్‌గా, అత్యంత వేగవంతమైన గ్రోత్ రేటు కలిగిన రాష్ట్రంగా పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని పారిశ్రామికవేత్తలందరూ గమనించాలి. – సీఎం వైఎస్ జగన్ -
స్టీల్ ప్లాంట్‌తో సొంతింటికి వచ్చినట్లుంది: సజ్జన్ జిందల్
సాక్షి, వైఎస్సార్: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే రోజులకు బీజం పడింది. కడప సిగలో మరో కలికితురాయి వచ్చి చేరబోతోంది. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ రాబోతోంది. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద భూమి పూజ చేశారు. జెఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సందర్భంగా ‘అందరికీ నమస్కారం’ అంటూ జెఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందల్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని సజ్జన్ జిందల్ అన్నారు. ఏపీకి సంబంధించి వైఎస్సార్ ఎన్నో విషయాలు చెప్పారన్నారు. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని సజ్జన్ జిందల్ ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులపై సజ్జన్ జిందల్ మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో మా గ్రూప్‌నకు చెందిన స్టీల్ ప్లాంట్ భూమి పూజకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది రాష్ట్ర ప్రజలతో పాటు, జిల్లా వాసుల చిరకాల వాంఛ. ఈ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఎంతో అంకితభావం, చిత్తశుద్దితో కృషి చేశారు. మమ్మల్ని నిరంతరం సంప్రదించారు. ఆయన చొరవ, ప్రయత్నం వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తోంది.’’ ► ‘‘ఇది వైయస్సార్ జిల్లా. ఇక్కడ ఇవాళ ఆయనను తల్చుకోకుండా ఉంటే, ఈ కార్యక్రమం అసంపూర్తిగా ఉండి పోతుంది. దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి నాకు వ్యక్తిగత మిత్రులు. ఆయనను ఎప్పుడు కలిసినా, మాట్లాడినా నాకెంతో సంతోషంగా ఉండేది. ఆయన నాకు ఒక మార్గదర్శకుడిగా ఉండేవారు. సీఎం వైఎస్ జగన్ కూడా నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో నేను నా సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి బాటలో పయనిస్తున్న సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు.’’ ► ‘‘నేను దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగాను. చాలా మంది ముఖ్యమంత్రులను కలిశాను. అందరూ సీఎం వైయస్ జగన్‌ను ప్రస్తావిస్తారు. ఆయన నాయకత్వం, పరిపాలన దక్షత గురించి చెబుతారు. ఎందుకంటే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గత మూడేళ్లుగా రాష్ట్ర జీడీపీ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకు ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ పరిపాలన, అంకితభావం. ఆయన చిత్తశుద్ధితో పని చేయడం వల్లనే ఇది సాధ్యమవుతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు.’’ ►‘‘నేను క్రితంసారి ఆయనను కలిసినప్పుడు కలిసి భోజనం చేశాం. దాదాపు గంటన్నర ఇద్దరం కలిసి ఉన్నాం. అప్పుడు ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోలేక పోయాం. అయినప్పటికీ ఆ సమయంలో కూడా ఆయన మొత్తం రాష్ట్రం గురించే మాట్లాడారు. ఏ విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది? ఈ విధంగా రాష్ట్ర రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తోంది? పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తోంది? విద్య, వైద్య రంగాలలో చేస్తున్న పెను మార్పులు.. ఇలా అన్ని విషయాలు చెప్పారు. వాటిన్నింటి వల్ల రాష్ట్రం ఎలా మారుతోంది అనే విషయం కూడా ప్రస్తావించారు.’’ ►‘‘రాష్ట్రంలో సువిశాల సముద్ర తీరం ఉంది. రాష్ట్రంలో చాలా పెద్ద పోర్టులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు ఏర్పాటువుతున్నాయి. ఒకటి ప్రైవేటు రంగంలో నిర్మిస్తుండగా, మిగిలిన మూడు ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి. అందరూ సంతోషంగా ఉండాలి. రాష్ట్రం అన్ని విధాలుగా ఇంకా అభివృద్ధి చెందాలన్నది తన ఆకాంక్ష అంటూ చెప్తున్న సీఎంగారి మాటలు వింటుంటే.. అప్పుడు ఒక దేవుడి నోటి నుంచి అవి వచ్చినట్లుగా అనిపించాయి.’’ ►‘‘గ్రామస్థాయిలో సేవలు, ఇంటి గడప వద్దనే ప్రభుత్వ పాలన. డిజిటల్ రూపంలో పంచాయతీల్లో సమగ్ర సమాచారం..వాటన్నింటి గురించి సీఎంగారు చెబుతూ పోతుంటే.. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. దురదృష్టవశాత్తూ నాకు తెలుగురాదు. నేను తెలుగులో మాట్లాడలేను. ఒకవేళ నేను తెలుగులో మాట్లాడి ఉంటే, నా ఫీలింగ్స్ మీరు అర్ధం చేసుకుని ఉండేవారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ వంటి యువ, డైనమిక్ ముఖ్యమంత్రి ఉండడం అదృష్టం. ఆయన వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటన్నది స్పష్టంగా కనిపిస్తోంది.’’ ►‘‘జిల్లాలో స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎంగారు చాలా చిత్తశుద్దితో ఉన్నారు. అందుకే భూమి పూజ, పనుల ప్రారంభం కోసం ఆయన విజయవాడ నుంచి ఇక్కడకు వచ్చారు. ఇవాళ పనులు ప్రారంభిస్తున్న ఈ కంపెనీ, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. పెద్ద స్టీల్ ప్లాంట్‌గా అభివృద్ధి చెందుతుంది.’’ ►‘‘బళ్లారిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం నేను తొలిసారి 1995లో అక్కడికి వెళ్లాను. అప్పుడు మేము అక్కడ 1.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం మొదలు పెట్టాం. మొక్కలా మొదలైన ఆ ప్లాంట్ ఇవాళ ఒక మహావృక్షంలా ఎదిగింది. ఇవాళ ఆ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్ టన్నులు. వచ్చే మూడేళ్లలో ఆ ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్‌గా అవతరించబోతోంది. అప్పటికి ఆ ప్లాంట్ సామర్థ్యం 25 మిలియన్ టన్నులకు చేరుతుంది. ఇవాళ ఇక్కడ కూడా ఆనాటి మాదిరిగానే అంతే సామర్థ్యంతో ప్లాంట్‌ను మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇది కూడా అలాగే ఎదుగుతుంది.’’ ►‘‘మా నాన్నగారు ఓపీ జిందల్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నీవు అభివృద్ధి చెందితే, నీ చుట్టూ ఉన్న వారు కూడా బాగు పడాలని. నీవు మాత్రమే బాగు పడి, నీ చుట్టూ ఉండే సమాజంలో మార్పు రాకపోతే, నీవు నీ పని సక్రమంగా నిర్వర్తించినట్లు కాదని. కాబట్టి మిత్రులారా, మీకు ఒక మాట చెబుతున్నాను. ఇవాళ మేము ఇక్కడ భూమి పూజ చేస్తోంది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే కాదు. ఇది జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్న భూమి పూజ. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. దేశవ్యాప్తంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతుంది.’’ ►‘‘బళ్లారిలోని విజయనగర్‌లో మా స్టీల్ ప్లాంట్ విజయానికి ఒక కారణం ఆ ప్రాంత ప్రజలు. కడపకు, బళ్లారికి చాలా పోలికలు ఉన్నాయి. రెండు ప్రాంతాల ప్రజలకు చాలా సామీప్యం ఉంది. వారు చాలా కష్టపడతారు. అలా పని చేసే మా బళ్లారి ప్లాంట్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్‌కు ఇంఛార్జ్ అయిన రాజశేఖర్ సండూరుకు చెందిన వారు. మా సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇస్తాం. అలా శిక్షణ పొందిన వారే మా బళ్లారి, మహారాష్ట్ర, ఒడిషా, గుజరాత్ ప్లాంట్లలో పని చేస్తున్నారు. ఈ ప్లాంట్‌లో కూడా అదే జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్‌ను ఒక మోడల్‌గా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ ప్లాంట్ గ్రీనెస్ట్ (పర్యావరణహిత) ప్రాజెక్టుగా నిలవబోతుంది. ఈ ప్లాంట్ హరిత ఇంధనం (గ్రీన్ ఫ్యుయెల్)తో పని చేస్తుంది. అందుకే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నాం.’’ ►‘‘2023లో నిర్మిస్తున్న ప్లాంట్ ప్రపంచ స్థాయిలో, ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్లాంట్‌గా నిలుస్తుంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తైతే, ప్రపంచంలోనే ఒక మోడల్‌గా నిలుస్తుంది. దీని గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో దీన్ని చూసేందుకు వస్తారు. కాబట్టి మిత్రులారా సుస్థిర స్థిరత్వం, అభివృద్ధి రెండూ ఒకటిగా సాధించే దిశగా మనమంతా కలిసి పని చేద్దాం. అలాగే సంపదను కూడా కేవలం సంస్థ మాత్రమే కాకుండా, అందరం కలిసి పంచుకుందాం. మన నిర్ణయాలు, మన పని భవిష్యత్ తరాలకు కూడా మేలు చేయాలి. ఈ ప్రాజెక్టు మనందరికీ ఒక గర్వకారణం కావాలని ఆకాంక్షిస్తూ.. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ.. సెలవు తీసుకుంటున్నాను’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.’’ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ►‘‘అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జమ్ముల మడుగు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడుకి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడి దయతో ఇవాళ వైయస్సార్ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.ఎన్నికల కోడ్ నేపధ్యంలో పెద్ద ఎత్తున జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని... వీలైనంత తక్కువ మందితో జరపాల్సి వచ్చింది. మమ్నల్ని కూడా పిలవండి అని కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అడుగుతున్నా... కోడ్ అడ్డంకిగా ఉందన్న విషయాన్ని పెద్ద మనసుతో అర్ధం చేసుకొండి.’’ స్టీల్ ప్లాంట్ పునాది రాయి చిరకాల స్వప్నం. ►‘‘ఈ రోజు మనం పునాది రాయి వేస్తున్న ఈ కార్యక్రమం మనం చిరకాల స్వప్నం. స్టీల్ ప్లాంట్ వస్తే ఏ రకంగా నగరాలుగా మారిపోతున్నాయి అన్నదాన్ని మనం గమనించాం. విశాఖపట్నం తీసుకున్నా.. కర్ణాటకలోని విజయనగరం పక్కన జిందాల్ వాళ్లు పెట్టిన ఫ్యాక్టరీ చూసినా, ఇతర ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ప్లాంటులు చూసినా జిల్లా అంతా ఎంత అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నది మనం చూశాం.అదే జరగాలి అని అప్పట్లో నాన్నాగారు ఉన్నప్పుడు ఈప్రాంతం అభివృద్ధి కోసం కలలుకని.. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలని ఆలోచన చేశారు. ఆయన చనిపోయిన తర్వాత జిల్లాను ఏ నాయకుడు పట్టించుకోకపోవడంతో జిల్లా మొత్తం వెనుకబాటుకు గురి కావడం మన కళ్లతో మనం చూశాం.’’ మరలా దేవుడి ఆశీస్సులతో ఇవాళ.. ‘‘ఈ రోజు దేవుడి మళ్లీ ఆశీర్వదించాడు. మీ బిడ్డ మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఈ ప్రాంతానికి ఒక్కొక్కటిగా పరిశ్రమలు వస్తూ.. మంచి రోజులు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ దేవుడి దయతో మనం ఎప్పటినుంచో స్వప్నంగా ఎదురుచూస్తున్న స్టీల్‌ప్లాంట్‌కు ఇవాళ శంకుస్ధాపన చేస్తున్నాం.’’ ‘‘ఇవాళ ఇక్కడ నిర్మించబోయే స్టీల్‌ప్లాంట్ ప్రాజెక్టు మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుంది. 3 మిలియన్ టన్నుల ప్లాంటును రెండు దశలలో కట్టడానికి జిందాల్ గారు కార్యాచరణ తయారు చేసారు. ఇందులో మొదటి దశ మరో 24 నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది. అది రూ.3,300 కోట్లతో పూర్తవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ మరో 5 సంవత్సరాలలో రూ.5,500 కోట్లతోనూ కలిపి మొత్తంగా రెండు దశల్లోనూ రూ.8,800 కోట్లతో ఈ ప్రాంతంలో 3మిలియన్ టన్నుల సామర్ధ్యమున్న స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఒక మంచి వ్యక్తి చేతుల మీదుగా జరుగుతుంది.’’ ‘‘జిందాల్ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ గారు 28.5 మిలియన్ టన్నుల స్టీల్ సామర్ధ్యంతో దాదాపు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులతో స్టీల్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ 3 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ప్రారంభించిన ఈ స్టీల్‌ప్లాంట్ అక్కడితో ఆగిపోదు.బళ్లారిలో కూడా జిందాల్ గ్రూపు స్టీల్ ప్లాంట్ మొదలుపెట్టినప్పుడు 3 మిలియన్ టన్నుల సామర్ధ్యం అనే చెప్పారు. ఇవాళ అది పెరుగుతూ వస్తూ... 13 మిలియన్ టన్నుల ప్లాంట్ అవడంతో ఆ ప్రాంత రూపురేఖలు అన్ని పూర్తిగా మారాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను.’’ రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు. ‘‘ఈ ప్లాంట్‌కు మద్ధతివ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కారణం ఈప్రాంతం సముద్రతీరానికి దగ్గరగా కాకుండా.. విసిరేసినట్టు దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. ఈ ప్లాంట్ కోసం ఇక్కడ మిగిలి ఉన్న భూములన్నీ రూ.40 కోట్లతో కొనుగోలు చేసి.. దాదాపు 3,500 ఎకరాలు సజ్జన్ జిందాల్ గారికి జిందాల్ ఫ్యాక్టరీకి ఇవ్వడమే కాకుండా... దాదాపు రూ.700 కోట్లతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం.’’ ‘‘కారణం ఇక్కడ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీతోపాటు పక్కన అనుబంధపరిశ్రమలు కూడా వ్యవస్ధ ఏర్పడుతుంది. ఫలితంగా ఇక్కడో స్టీల్ సిటీ ఆవిర్భావమవుతుందన్న ఉద్దేశ్యంతో గొప్ప అడుగులు వేస్తున్నాం. ఈ ప్లాంట్‌కు సంబంధించి 67వ నెంబరు జాతీయ రహదారిని కలుపుతూ.. ఏడున్నర కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రోడ్డు వేస్తున్నాం. ప్రొద్దుటూరు, ఎర్రగుంట రైల్వే లైను కొరకు కొత్తగా మరో పదికిలోమీటర్లు లైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిసరఫరా కోసం ప్రత్యేక పైపులైన్ ద్వారా అందించే కార్యక్రమం చేపడుతున్నాం. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం తలమంచిపల్లె సబ్‌స్టేషన్ నుంచి ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 220 కేవీ లైన్ కూడా నిర్మిస్తున్నాం. ఈ రకమైన మౌలిక సదుపాయాలు ఈ ప్లాంట్‌కు అందించేందుకే దాదాపు రూ.700 కోట్లు మనం ఖర్చు చేస్తున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను.’’ ‘‘ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటికే కొప్పర్తిలో 550 ఎకరాలు కేటాయించి.... ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)ను తీసుకొచ్చాం. ఇక్కడకు దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆ 550 ఎకరాల్లో మొత్తం పరిశ్రమలు వస్తే... మొత్తంగా లక్ష మంది మందికి ఉద్యోగాలు వచ్చే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే అక్కడ రూ.1100 కోట్లతో పెట్టుబడులు వచ్చాయి. 11,500 మందికి ఉద్యోగాలకు సంబంధించిన కార్యాచరణకూడా వేగంగా జరుగుతుంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌పేరుతో 3,155 ఎకరాలను కేటాయించి.. అడుగులు ముందుకు వేస్తున్నాం. అక్కడ కూడా రూ.18వేల కోట్ల రూపాయిల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాలను క్రియేట్ చేస్తున్నాం. తద్వారా 1.75లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది.’’ చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగం దిశగా.. ‘‘ఈ రకంగా చదువుకున్న ప్రతి పిల్లాడికి మన ప్రాంతంలోనే మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని మన పిల్లలకు రావాలన్న తపన, తాపత్రయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకు ఇవ్వాలని మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది.వీటన్నింటితో మన ప్రాంతం అంతా బాగుపడాలని, మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటూ, తపిస్తున్నాను.’’ జిందాల్ గారికి ధన్యవాదాలు... ‘‘అదే విధంగా ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు సజ్జన్ జిందాల్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రాంతం అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉంది. ఈ తరహా పెట్టుబడి ఇక్కడ పెట్టడం ద్వారా ఈ జిల్లా ముఖచిత్రం మారిపోనుంది. ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా..మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి ఒక ఆశ కల్పించారు. మీరు స్టీల్ ప్లాంట్ కోసం పెడుతున్న రూ.8,800 కోట్ల పెట్టుబడితో ఆగిపోకూడదని విశ్వసిస్తున్నాను. ఇంకా మిగిలిన గ్రీన్ హైడ్రోజన్, సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల దిశగా కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాం. ఈ రంగంలో దాదాపు 30 వేల కోట్ల పెట్టుబడులుకు అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడి ద్వారా మీరు ఆ దిశగా కూడా నమ్మకాన్ని కల్పించారు.’’ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ ఏపీ ‘‘ఈ సందర్భంగా నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2019 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చే ముందు పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో.. పరిశ్రమల స్ధాపనకు చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాడ్ వల్లే మేం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలకు ఎంత అనుకూలంగా ఉంది, పారిశ్రామిక వేత్తలు ఏపీలో పరిశ్రమల స్ధాపనకు ఎంతటి సానుకూలంగా ఉన్నారన్న విషయాన్ని ఈ ర్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ’’ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2021–22లో 11.43 శాతం గ్రోత్ రేటుతో ఏపీ దేశంలోనే వేగవంతమైన గ్రోత్ రేటు గల రాష్ట్రంగా మొదటి స్ధానంలో నిల్చింది. ఈ రెండు అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలకు ఏ మేరకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం.. ‘‘నేను మరో విషయం మీకు స్పష్టం చేస్తూ హామీ ఇస్తున్నాను. మీకు ఏ సమస్య ఉన్న, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరిస్తుంది. మీ అందరి తరపును నేను సజ్జన్ జిందాల్ గారికి హామీ ఇస్తున్నాను. ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం 3 మిలియన్ టన్నులతో ప్రారంభమైన ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా విస్తరణ జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడకు వస్తున్న పెట్టుబడులను మనసారా ఆహ్వానిస్తూ పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటామని మీ తరపున హామీ ఇస్తున్నాను. ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు.’’ -
స్టీల్ ధరలు మరింత భారం
న్యూఢిల్లీ: దేశీ స్టీల్ తయారీ కంపెనీలు హాట్ రోల్డ్ క్వాయిల్స్(హెచ్ఆర్సీ) ధరలను టన్నుకి రూ. 1,500–2,000 స్థాయిలోపెంచేందుకు నిర్ణయించాయి. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తుల ధరలను హెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రీబార్ ధరలను టన్నుకి రూ. 1,250 చొప్పున పెంచింది. గురువారం నుంచీ తాజా ధరలు అమల్లోకి రానున్నాయి. ఇక సెయిల్ సైతం హెచ్ఆర్సీ, కోల్డ్ రోల్డ్ క్వాయిల్స్(సీఆర్సీ) ధరలను టన్నుకి రూ. 1,500 స్థాయిలో హెచ్చించింది. రానున్న రోజుల్లో మరికొన్ని కంపెనీలు సైతం ధరలను పెంచే వీలుంది. ప్రధానంగా స్టీల్ తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే కోకింగ్ కోల్ ధరల్లో భారీ పెరుగుదల ప్రభావం చూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వీటి ధరలు ఇటీవల రెట్టింపునకుపైగా ఎగశాయి. సెప్టెంబర్‌లో టన్నుకి 300 డాలర్లు పలికిన కోల్ ధరలు ప్రస్తుతం 700 డాలర్లకు జంప్‌చేశాయి. ప్రధానంగా గత నెల రోజుల్లోనే రెట్టింపైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. ఈ నెల (మార్చి)లోనే స్టీల్ కంపెనీలు ఉత్పత్తుల ధరలను నాలుగుసార్లు పెంచడం గమనార్హం! మరింత పెరిగే చాన్స్ తాజా పెంపుదలతో హెచ్ఆర్సీ ధరలు టన్నుకి రూ. 72,500–73,500కు చేరగా.. సీఆర్సీ ధరలు రూ. 78,500–79,000ను తాకినట్లు తెలుస్తోంది. ఇక రీబార్ ధరలు సైతం టన్నుకి రూ. 71,000–71,500కు చేరినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌లో స్టీల్ ధరలు మరింత పెరిగే అవకాశముంది. టన్ను ధర రూ. 80,000ను తాకే వీలున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టీల్ షేర్లు జూమ్ ఉత్పత్తుల ధరలను పెంచడంతో బుధవారం ట్రేడింగ్‌లో పలు స్టీల్ కౌంటర్లు భారీ లాభాలతో తళతళలాడాయి. ఎన్ఎస్ఈలో సెయిల్ 3.4 శాతం జంప్‌చేసి రూ. 103 వద్ద నిలవగా, జిందాల్ స్టీల్(జేఎస్పీఎల్) 3.5 శాతం ఎగసి రూ. 510 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ. 514 అధిగమించి 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో టాటా స్టీల్ 2 శాతం బలపడి రూ. 1,329 వద్ద స్థిరపడింది. -
బీఎస్ఈ బాండ్స్ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సీపీ
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ తన కమర్షియల్ పేపర్స్‌ను (సీపీ) బీఎస్ఈ బాండ్స్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేయాలని బీఎస్ఈకి దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీతో పాటు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా మనీ, ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్.. మొత్తం ఐదు కంపెనీలు సీపీ లిస్టింగ్ కోసం దరఖాస్తు చేశాయి. గురువారం ఈ కంపెనీల కమర్షియల్ పేపర్స్‌ను లిస్ట్ చేస్తామని బీఎస్ఈ పేర్కొంది. ఈ కంపెనీలతో కలుపుకుంటే బీఎస్ఈ బాండ్స్ ప్లాట్‌ఫామ్‌పై కమర్షియల్ పేపర్స్‌ను లిస్ట్ చేసిన కంపెనీల సంఖ్య 16కు పెరుగుతుంది. ఈ కమర్షియల్ పేపర్స్ ద్వారా కంపెనీలు రూ.17,835 కోట్లు సమీకరించాయి. కమర్షియల్ పేపర్స్ అంటే... పెద్ద పెద్ద కంపెనీలు తమ స్వల్పకాలిక రుణాల కోసం ప్రామిసరీ నోట్ల రూపంలో జారీ చేసే మనీ మార్కెట్ సాధనంగా కమర్షియల్ పేపర్స్‌ను చెప్పుకోవచ్చు. వీటి మెచ్యురిటీ కాలం జారీ చేసిన తేదీ నుంచి కనిష్టంగా ఏడు రోజులు గరిష్టంగా ఏడాది కాలం ఉంటుంది. ముఖ విలువ కంటే కొంచెం డిస్కౌంట్‌కు వీటిని జారీ చేస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ వడ్డీరేట్లు వర్తిస్తాయి. -
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ చేతికి అఫెర్పి
న్యూఢిల్లీ: ఇటలీలో రెండో అతి పెద్ద ఉక్కు సంస్థ అఫెర్పిని దేశీ ఉక్కు దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం అఫెర్పీ మాతృసంస్థ, అల్జీరియాకి చెందిన సెవిటాల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ. 600 కోట్లు ఉండొచ్చని అంచనా. గతంలోనూ దీన్ని కొనుగోలు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రయత్నించింది. అప్పట్లో లుషినిగా పేరొందిన ఈ సంస్థను 2014లో సెవిటాల్ కొనుగోలు చేసి.. అఫెర్పిగా పేరు మార్చింది. తాజాగా దీన్నే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఇప్పుడు ఎట్టకేలకు దక్కించుకుంటోంది. స్ప్రింగ్‌లు, రైల్వే అవసరాల కోసం రైల్స్, వైర్ రాడ్స్ మొదలైన వాటికి ఉపయోగపడే ప్రత్యేక తరహా ఉక్కును అఫెర్పి తయారు చేస్తుంది. ప్రస్తుతం 18 మిలియన్ టన్నులుగా ఉన్న వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 40–45 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఎస్సార్ స్టీల్ ట్విస్ట్: రేసులో వేదాంత
సాక్షి,న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో పీకల్లోతున కూరుకుపోయి దివాలా దిశగా అడుగులు వేస్తున్న దేశీయ ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్ బిడ్డింగ్ రేసులో తాజాగా మరోదిగ్గజం చేరింది.ఇప్పటికే అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ ఈ రేసులో ముందుండగా ఇపుడు వేదాంతా వచ్చి చేరింది. రెండవ రౌండ్ బిడ్డింగ్ ప్రక్రియలో ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బిడ్ల దాఖలుకు సోమవారమే తుది గడువు. ఫిబ్రవరి 12నాటి మొదటి దశలో బిడ్డింగ్‌లో ఆర్సెలార్ మిట్టల్, మారిషస్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ న్యుమెతాల్తో కలిసి జెస్ డబ్ల్యూ రెండు సంస్థలు ప్రధానంగా నిలవగా ఇపుడు వేదాంతా దీనికోసం పోటీ పడుతున్న దిగ్గజాల సరసన చేరింది. అయితే మొదటి దశ బిడ్డింగ్‌లో ఐబిసి చట్టాల ప్రకారం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రెండు సంస్థల బిడ్లను తిరస్కరించాయి. కాగా దివాలా చట్టం కింద తొలి విడతలో చర్యలు చేపట్టేందుకు రిజర్వు బ్యాంకు గుర్తించిన 12 కంపెనీల్లో ఎస్సార్ స్టీల్ ఒకటి. గుజరాత్లో ప్రధాన ఉత్పత్తి కేంద్రం ఉన్న ఎస్సార్స్టీల్ సంవత్సరానికి 9.6 మిలియన్ టన్నుల నామమాత్రపు సామర్ధ్యం కలిగివుంది. అయితే భారీగా పెరిగిన ముడి ఇనుము ధరలు, ఉత్పత్తి వ్యయాలు కంపెనీకి ప్రతిబంధకం మారాయి. -
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభం రూ.624 కోట్లు
జూన్ క్వార్టర్లో 44 శాతం క్షీణత న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు జూన్ త్రైమాసికంలో వ్యయాల సెగ తగిలింది. కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 44 శాతం క్షీణించింది. రూ.624 కోట్ల లాభాన్ని కంపెనీ నమోదు చేయగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.1,120 కోట్లుగా ఉంది. స్టీల్ ఉత్పత్తి ఫ్లాట్‌గా ఉండడంతోపాటు, ఐరన్‌ఓర్, విద్యుత్ రూపేణా ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోవడం లాభాలు తగ్గడానికి దారితీశాయి. ఆదాయం మాత్రం 24 శాతం వృద్ధితో రూ.15,977 కోట్లు నమోదైంది. వ్యయాలు 33 శాతం పెరిగి రూ.15,124 కోట్లకు చేరడం గమనార్హం. స్టీల్ ఉత్పత్తి కేవలం ఒక శాతమే పెరిగి 3.91 మిలియన్ టన్నులుగా ఉంటే, స్టీల్ అమ్మకాలు మాత్రం 5 శాతం వృద్ధి చెంది 3.51 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. జీఎస్టీకి మారే దశలో సరుకుల నిల్వలు తగ్గించుకోవడం వల్ల పరిశ్రమ వ్యాప్తంగా దేశీయ అమ్మకాలపై ప్రభావం ఉందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ జేఎండీ శేషగిరిరావు తెలిపారు. ఉత్పత్తుల్లో వైవిధ్యంపై తమ దృష్టి కొనసాగుతుందని, విలువ జోడించిన ఉత్పత్తుల విక్రయాలు ఏటేటా 12 శాతం వృద్ధి చెందుతున్నట్టు ఆయన చెప్పారు. ఎగుమతులు జూన్ త్రైమాసికంలో 26 శాతం పెరిగినట్టు తెలిపారు. డోల్వి, విజయ్‌నగర్ యూనిట్ల విస్తరణ కోసం ఏటా రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. సొంతంగా 5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు, కంపెనీల కొనుగోళ్ల అవకాశాలతోనూ వృద్ధి చెందాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో స్టాక్ ధర 0.70 శాతం పెరిగి రూ.222.95 వద్ద క్లోజయింది. -
ఇక ‘జిందాల్’ పెయింట్స్
♦ రెండు ప్లాంట్ల పనులు ప్రారంభం ♦ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి.. ముంబై: సజ్జన్ జిందాల్ కుటుంబం పెయింట్ల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. రెండు ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఒక ప్లాంట్‌ను(డెకరేటివ్ పెయింట్స్) కర్ణాటకలోని విజయ్‌నగర్‌లో, మరో ప్లాంట్(ఇండస్ట్రియల్ సెగ్మెంట్)ను మహారాష్ట్రలోని వసింధ్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఈ వ్యాపారాన్ని చూస్తున్న పార్థు జిందాల్ తెలియజేశారు. ఈ రెండు ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, రెండేళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్లోనూ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారాయన. ఈ కుటుంబం జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కంపెనీలను నిర్వహిస్తోంది. వన్ స్టాప్ సొల్యూషన్ పెయింట్ల పరిశ్రమ ప్రతి ఏటా 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోందని, ఈ రంగంలో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా ప్రతి ఏడాదీ పెరుగుతోందని పార్థు జిందాల్ చెప్పారు. ఇప్పటికే స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నామని, పెయింట్ల రంగంలో ప్రవేశించడం ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ (అన్ని ఉత్పత్తులు ఒకే చోట అందించే) అవకాశం లభించనున్నదని వివరించారు. బీ2బీ (బిజినెస్ టు బిజినెస్), బీ2సీ (బిజినెస్ టు కన్సూమర్) సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందిస్తామని పేర్కొన్నారు. భారత్‌లో మొత్తం పెయింట్ల మార్కెట్ ఏడాదికి 25 లక్షల కిలో లీటర్లని, దీంట్లో ఏషియన్ పెయింట్స్ వాటా 10 లక్షల కిలోలీటర్లని తెలిపారు. 2025 కల్లా 10 లక్షల కిలోలీటర్ల మార్కెట్‌ను సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. మొదట్లో దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలపై దృష్టి పెడతామని ఆయన వివరించారు. -
కర్ణాటక గనుల వేలంకు స్పందన కరువు
న్యూఢిల్లీ: కర్ణాటకలోని ఇనుప ఖనిజ గనుల ఈ–వేలం పాటకు ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినంత స్పందన రాకపోవడంతో మిగిలిపోయిన గనుల్ని కలిపి వేలం పాట వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు ఈ అంశానికి సంబంధించి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ వేలం పాట రెండవ దశలో మొత్తం 14 మైనింగ్ గనులకు గాను ఎన్ఎండీసీ, జిందాల్, వేదాంత సంస్థలతో మరికొన్ని సంస్థలు ఏడు మైనింగ్ గనులను దక్కించుకోగా ఏడు మైనింగ్ గనులు మిగిలిపోయాయి. అయితే ఆ మైనింగ్ గనుల్లో తగినంత ఇనుప ఖనిజం నిల్వలు లేకపోవడంతోపాటు తక్కువ నాణ్యత కారణంగానే ఏ సంస్థలు వాటిపట్ల ఆసక్తి చూపించలేదని ఓ ప్రభుత్వాధికారి వెల్లడించారు. దీనికి పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రైవేటు కంపెనీలకు అనుగుణంగా ఈ ఏడు మైనింగ్ గనుల్ని కలిపి మొత్తం 14 మైనింగ్ గనులకు ఒకేసారి వేలం పాట వేసేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదే సమయంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర మైనింగ్ మంత్రిత్వశాఖతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. -
స్టీల్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: మార్చి నుంచి స్టీల్ ధరలు పెరగనున్నాయ్. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)తో పాటు, ప్రయివేట్ రంగ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ధరల్ని పెంచుతున్నాయి. మార్చి 1 నుంచి స్టీల్ ధరలను టన్నుకి రూ. 1,000 వరకూ పెంచనున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. ఇక జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఇప్పటికే టన్ను ధరపై రూ.750 వరకూ వడ్డించనున్నట్లు తెలిపింది. ముడిఇనుము ధరలతోపాటు, రవాణా చార్జీలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా వైజాగ్ స్టీల్ పేర్కొంది. వెరసి వివిధ రకాల ఉత్పత్తులపై టన్నుకి కనిష్టంగా రూ. 750, గరిష్టంగా రూ. 1,000ను పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ బాటలో ఎస్సార్ స్టీల్ కూడా వచ్చే నెల నుంచి టన్నుకి రూ. 1,000 వరకూ స్టీల్ ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్కు తయారీ వ్యయాలు పెరగడానికితోడు డిసెంబర్ క్వార్టర్లో స్టీల్‌కు కొంత డిమాండ్ పుంజుకోవడం కూడా ధరల పెంపుకు కారణమైనట్లు ఆ వర్గాలు వివరించాయి. మూడోసారి ఈ ఏడాది ఇప్పటివరకూ స్టీల్ ధరలు రెండు సార్లు పెరిగాయి. ప్రస్తుత ప్రతిపాదనల నేపథ్యంలో స్టీల్ ధరలు మూడోసారి హెచ్చనున్నాయి. దేశీయ స్టీల్ తయారీ సంస్థలు ఇప్పటికే జనవరి-ఫిబ్రవరిలో టన్నుకి రూ. 2,500-3,000 స్థాయిలో ధరలను పెంచాయి. ఇందుకు ముడిసరుకుల ధరలు, రవాణా వ్యయాలే కారణమైనప్పటికీ ఇటీవల స్టీల్‌కు డిమాండ్ పుంజుకోవడం కూడా దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. విదేశాలకు స్టీల్ ఎగుమతులు వృద్ధి చెందుతుండటంతో దేశీయంగా అధిక సరఫరాకు చెక్ పెట్టేందుకు కంపెనీలకు వీలు చిక్కుతోంది. ఇది మరోవైపు ఉత్పత్తుల ధరలు పెంచేందుకు కూడా దారి చూపుతోంది. అయితే ధరల పెంపును మార్కెట్లు పూర్తిస్థాయిలో గ్రహించే అవకాశాలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి స్టీల్ వినియోగం అంత ప్రోత్సాహకరంగా ఏమీలేదని, ఈ నేపథ్యంలో ధరల పెంపు కొనసాగేదీ లేనిదీ చూడాల్సి ఉన్నదని జయంత్ రాయ్ వ్యాఖ్యానించారు. రేటింగ్ దిగ్గజం ఇక్రాకు చెందిన కార్పొరేట్ రంగ విభాగానికి సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా జయంత్ పనిచేస్తున్నారు. ఇదీ ధరల తీరు: నిర్మాణ రంగంలో వినియోగించే టీఎంటీ బార్లు, స్ట్రక్చర్లు వంటి లాంగ్ ప్రొడక్ట్‌ల ధరలు ప్రస్తుతం టన్నుకి రూ. 37,000-39,000 స్థాయిలో ఉన్నాయి. ఇక ఆటోమొబైల్, వినియోగ వస్తు రంగాలు కొనుగోలు చేసే హెచ్ఆర్ క్వాయిల్, సీఆర్ క్వాయిల్ వంటి ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల ధరలైతే టన్నుకి రూ. 39,500-43,500 మధ్య పలుకుతున్నాయి. -
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో ఉక్కు ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దేశీయ ఉక్కు దిగ్గజ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ధరలను టన్నుకు రూ.1,000 చొప్పున(2% వరకూ) పెంచాలని నిర్ణయించింది. ఇదే బాటలో ఇతర ఉక్కు కంపెనీలు-సెయిల్, ఎస్సార్ స్టీల్, టాటా స్టీల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్లు కూడా రానున్న రోజుల్లో ధరలను పెంచనున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఇనుప ఖనిజం ధరలు 2 శాతం, బొగ్గు ధరలు టన్నుకు 20 డాలర్లు చొప్పున పెరిగాయని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ డెరైక్టర్ కమర్షియల్ అండ్ మార్కెటింగ్ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. ధరలు పెంచక తప్పని పరిస్థితని వివరించారు. ఎగుమతి ఆధారిత తయారీరంగ పరిశ్రమలు, వ్యవసాయాధారిత రంగాల నుంచి ఉక్కుకు డిమాండ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రికవరీ బాట పడుతున్న పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా నుంచి కూడా ఉక్కుకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.