గ్రామీణ గృహ రుణాల్లోకి మాగ్మా | Magma to rural housing loans | Sakshi
Sakshi News home page

గ్రామీణ గృహ రుణాల్లోకి మాగ్మా

Published Thu, Sep 17 2015 2:29 AM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM

గ్రామీణ గృహ రుణాల్లోకి మాగ్మా - Sakshi

గ్రామీణ గృహ రుణాల్లోకి మాగ్మా

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకింగేతర రుణ సంస్థ మాగ్మా ఫిన్‌కార్ప్ గ్రామీణ గృహ రుణ విభాగంలోకి అడుగిడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టిన సంస్థ 2015-16లోనే ఈ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఆస్తి తనఖాపై రూ.3 లక్షల వరకు రుణమిస్తారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా ఆస్తులు సంక్రమిస్తాయి. చాలా మంది వద్ద సరైన పత్రాలు ఉండవు. ఇటువంటి వారికి బ్యాంకుల నుంచి రుణం అంత సులభం కాదు. అర్హత గలవారికి రుణం ఇస్తాం’ అని మాగ్మా ఫిన్‌కార్ప్ వైస్ ప్రెసిడెంట్, ట్రాక్టర్స్ విభాగం నేషనల్ సేల్స్ హెడ్ ధ్రుబాశిష్ భట్టాచార్య చెప్పారు. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఏవీపీ సూర్యకాంత్ మిశ్రాతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లోన్ల విషయంలో స్వయం ఉపాధి పొందుతున్న చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మాత్రమే రుణాలివ్వాలని కంపెనీ నిర్ణయించింది. రిస్క్ తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ధ్రుబాశిష్ భట్టాచార్య పేర్కొన్నారు. 2015-16లో తెలంగాణలో 20 శాతం వృద్ధిని ల క్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. ట్రాక్టర్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్-ఆగస్టు కాలంలో 15 శాతం తిరోగమన వృద్ధి నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement