
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరాలకు మాత్రమే పరిచయమైన పని దగ్గరే ఇల్లు (వాక్ టు వర్క్) కల్చర్ ద్వితీయ శ్రేణి పట్టణాలకూ పాకింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మెరుగైన మౌలిక వసతులతో పాటూ ఇంటికి దగ్గర్లోనే పని ప్రదేశం, స్కూల్, ఆసుపత్రి, సూపర్ మార్కెట్, సినిమా హాల్.. ఇలా ప్రతీ ఒక్కటీ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రాజెక్ట్‌లను కర్నూలు వాసులకూ పరిచయం చేసేందుకు సిద్ధమైంది రాగమయూరి నిర్మాణ సంస్థ. ఎకనామిక్ సిటీ పేరిట త్వరలోనే ప్రారంభంకానున్న ప్రాజెక్ట్ వివరాలను సంస్థ సీఎండీ కే జే రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.
♦ నన్నూరు గ్రామంలో రూ.1,660 కోట్ల పెట్టుబడితో 182 ఎకరాల్లో ఎకనామిక్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే.. వ్యక్తిగత గృహాలతో పాటూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ)లకు స్థల కేటాయింపులుంటాయి.
♦ 182 ఎకరాల్లో ఎకనామిక్ సిటీలో.. 135 ఎకరాలు గృహాలకు, 47 ఎకరాలు పరిశ్రమలకు కేటాయించాం. ఫేజ్–1లో 40 ఎకరాల్లో గృహాలను, 10 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. తొలి దశలో 1,500 గృహాలొస్తాయి.
♦ ఈడబ్ల్యూఎస్ గృహాలు 73 గజాల్లో 430 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటుంది. ధర రూ.10 లక్షలు. ఇవి 4,640 యూనిట్లుంటాయి. ఎల్‌ఐజీ ఇళ్లు 133 గజాల్లో 650 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటాయి. ధర రూ.16.50 లక్షలు. 1,680 యూనిట్లుంటాయి. ఎంఐజీ ఇళ్లు 170 గజాల్లో 850 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటాయి. ధర రూ.21 లక్షలు. ఇవి 2,640 గృహాలుంటాయి. వీటితో పాటూ 300 చ.అ., 430 చ.అ.ల్లో అపార్ట్‌మెంట్లు కూడా ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5.40 లక్షలు.
పీఎంఏవై సబ్సిడీ కూడా..
పీఎంఏవై సబ్సిడీ ఎకనామిక్ సిటీకి వర్తిస్తుంది. వార్షికాదాయం రూ.3 లక్షల లోపున్న కొనుగోలుదారులకు రూ.2.67 లక్షల సబ్సిడీ వస్తుంది. అలాగే ఎంఎస్‌ఎంఈ స్థల కొనుగోలుదారులకు స్థానిక ప్రభుత్వం అందించే రాయితీలు కూడా వర్తిస్తాయి.
జీఎస్‌టీ, స్టాంప్ డ్యూటీ లేదు..
స్థానిక ప్రభుత్వం ఎకనామిక్ సిటీలో కొనుగోలు చేసే ఈడబ్ల్యూఎస్ గృహాలకు స్టాంప్ డ్యూటీ చార్జీలు, జీఎస్‌టీలను మినహాయింపునిచ్చింది. ఎల్‌ఐజీ, ఎంఐజీ గృహ కొనుగోలుదారులనూ నిరుత్సాహపర్చకూడదనే ఉద్దేశంతో ఈ గృహాల కస్టమర్ల స్టాంప్ డ్యూటీ చార్జీలను కంపెనీయే భరిస్తుంది. జీఎస్‌టీ మాత్రం కస్టమర్లే చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment