టుబాకో కంపెనీలకు షాకిచ్చిన ఏఎక్స్ఏ | World's top insurer ditches $2 billion tobacco investment | Sakshi
Sakshi News home page

టుబాకో కంపెనీలకు షాకిచ్చిన ఏఎక్స్ఏ

Published Tue, May 24 2016 12:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

టుబాకో కంపెనీలకు షాకిచ్చిన  ఏఎక్స్ఏ

టుబాకో కంపెనీలకు షాకిచ్చిన ఏఎక్స్ఏ

లండన్ : ప్రపంచంలోనే అతిపెద్ద బీమాదారుడు ఏఎక్స్ఏ టుబాకో కంపెనీల్లో ఉన్న 2500లక్షల డాలర్ల స్టాక్స్ ను వెంటనే అమ్మేయాలని నిర్ణయించింది. టుబాకో కంపెనీల్లో బాండ్ల కొనుగోలు చేయడం కూడా ఆపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే టుబాకో కంపెనీలో ఉన్న 160లక్షల యూరోల విలువైన  బాండ్లను తగ్గించుకున్నామని తెలిపింది. నాన్-బ్యాంకింగ్ ఆస్తుల వ్యవస్థలో ఈ ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ దిగ్గజం ఏఎక్స్ఏ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. స్మోకింగ్ ప్రజల ఆరోగ్యానికి తీవ్రంగా హానిచేస్తుందని, క్యాన్సర్ కు, గుండె సంబంధ వ్యాధులకు, ఊపిరితిత్తుల జబ్బులకు ఇది ఎక్కువగా దోహదంచేస్తుందని ఏఎక్స్ఏ పేర్కొంది.

ప్రపంచంలో 68శాతం మరణాలు స్మోకింగ్ కారణంతోనే జరుగుతున్నాయని తెలిపింది. ప్రతి ఏడాది 60లక్షల ప్రజలను టుబాకో చంపుతుందని, దానిలో 50లక్షలకు పైగా స్మోకర్స్ ఉంటే, 6లక్షల మంది నాన్ స్మోకర్స్ ఆ స్మోకింగ్ పొగతో ప్రాణాలు విడుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు నివేదించింది. ఈ పరిస్థితి భవిష్యత్తులో మరింత దారుణంగా ఉండబోతాయని గుర్తించిన ఏఎక్స్ఏ టుబాకో కంపెనీల్లో పెట్టుబడులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఎక్కువగా ఈ మరణాలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటున్నాయని పేర్కొంది.

ఆరోగ్య బీమాలో అగ్రగామిగా ఉన్న ఏఎక్స్ఏ గ్రూప్ ఈ మరణాలకు చెక్ పెట్టేందుకు టుబాకో ఉత్పత్తులను తగ్గించాలని నిర్ణయించిందని ఏఎక్స్ఏ  గ్రూప్ డిప్యూటీ సీఈవో థామస్ బూబెర్ల్ తెలిపారు. మరోవైపు టుబాకో కంపెనీలకు మార్కెట్లో పెట్టుబడులు భారీగా ఉంటున్నాయి. జనవరి,  ఏప్రిల్ మధ్య కాలంలో 10శాతం పెరిగాయని ఎమ్ఎస్సీఐ వరల్డ్ టుబాకో ఇండెక్స్ నివేదించింది.

Advertisement

పోల్

Advertisement