చిలమత్తూరు : పరిశ్రమల స్థాపన కోసం హిందూపురం రూరల్ ఏరియాలోని కొటిపి, మలుగూరు ప్రాంతంలో 1000 ఎకరాల భూసేకరణకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రమామణి పేర్కొన్నారు. చిలమత్తూరు మండలం టేకులోడు –కంబాలపల్లి రోడ్డు మధ్యలో రైతుల నుంచి సేకరించిన భూములకు ఎకరాకు రూ.6.50 లక్షల చొప్పున 53 మంది రైతులకు చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు. చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆమె తనిఖీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ హిæందూపురం రూరల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి కోసం మలగూరు, కొటిపి ప్రాంతాల్లో 1000 ఎకరాల భూములు సేకరిస్తామన్నారు. టేకులోడులో పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.6.50 లక్షలు నష్టపరిహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఆమెతో పాటు పెనుకొండ ఆర్డీఎ రామ్మూర్తి, తహసీల్దార్ ఇబ్రహీంసాబ్ తదితరులు ఉన్నారు.
‘1000 ఎకరాల భూసేకరణకు సన్నాహాలు’
Published Sat, Jul 8 2017 11:22 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
Advertisement
Advertisement