స్త్రీ నిధి రుణ లక్ష్యం రూ.100 కోట్లు
రేగిడి: జిల్లాలో ఈ ఏడాది స్త్రీ నిధి కింద 45 వేల స్వయంశక్తి సంఘాలకు రూ.100 కోట్ల రుణం మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు పథక ఏజీఎం పొగిరి కష్ణమూర్తినాయుడు తెలిపారు. రేగిడి వచ్చిన ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడారు. ఇప్పటివరకు రూ.15 కోట్లు స్త్రీ నిధి రుణాలు మంజూరు చేశామన్నారు. మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో రుణ లక్ష్యాన్ని ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి మరో రూ.38 కోట్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. రేగిడి మండలంలో రూ.2.24 కోట్లు రుణ లక్ష్యం కాగా రూ.53 లక్షలు మాత్రమే సంఘాలకు చెల్లించారని, ఈ లక్ష్యాలను మరింత పెంచాల్చి ఉందన్నారు. రికవరీ శాతం కూడా బాగానే ఉందని, మొండి బకాయిల వసూలపై దష్టిసారించినట్టు వెల్లడించారు.