
బిగ్ ఫ్లైట్ పోటీలో అఖిల్ ప్రతిభ
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉన్న విద్యార్థులను గుర్తించి గుంటూరు ఆర్‌కే పురం గురుకుల పాఠశాలలో గతనెల 29న పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన అఖిల్‌కు ప్రభుత్వం గన్నవరం నుంచి హైదరాబాద్ విమానంలో తీసుకు వెళ్లి చారిత్రక ప్రదేశాలను తిలకించే ఏర్పాట్లు చేసిందన్నారు. అఖిల్‌ను సాగనంపడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు కుటుంబరావు, కమలారత్నం మాట్లాడుతూ విమానాన్ని ఆకాశంలో వెళ్తుండగా చూడటమే తప్ప తమ బిడ్డ విమానంలో ప్రయాణిస్తాడని ఎన్నడూ ఊహించలేదని అన్నారు.