to hyd
-
1,150 కిలోమీటర్ల మేర ఐవోసీ పైప్‌లై న్
జంగారెడ్డిగూడెం : ఒడిసాలోని పారాదీప్ ఆయిల్ శుద్ధి కర్మాగారం నుంచి హైదరాబాద్ వరకు 1,150 కిలోమీటర్లు ఆయి ల్ పైప్‌లై న్ వేయనున్నట్టు పైప్‌లై న్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ అధీకృత అధికారి కె.అనిల్జెన్సీసన్ తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఈ పైప్‌లైన్‌ను సుమారు రూ.2 వేల కోట్లతో వేయనుందన్నారు. పైప్‌లైన్ రాష్ట్రం లో 675 కిలోమీటర్ల మేర ఉంటుందని, జిల్లాలోని 10 మండలాల మీ దుగా పైప్‌లైన్ వెళుతుందని చెప్పారు. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లో ప్రత్యేక ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తామన్నారు. పైప్‌లైన్‌కు ప్రాథమిక సర్వే పూర్తయిందని చెప్పారు. 18 మీటర్ల వెడల్పు, మీటరున్నర లోతులో పైప్‌లైన్ ఉంటుందన్నారు. సమావేశంలో ఐవోసీ చీఫ్ కనస్ట్రక్షన్స్ మేనేజర్ బీవీఎస్ ప్రసాద్, సైట్ ఇంజనీర్లు విశ్వతేజ, చైత్ర తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
బిగ్ ఫ్లైట్ పోటీలో అఖిల్ ప్రతిభ
చింతలపూడి: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి కొత్తపల్లి అఖిల్ (6వ తరగతి)కు ఈనెల 29న గన్నవరం నుంచి హైదరాబాద్ విమానంలో వెళ్లే అవకాశం కల్పించినట్టు ప్రిన్సిపాల్ బి.రాజారావు బుధవారం తెలిపారు. గత నెలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బిగ్ ఫ్లైట్ టికెట్ పోటీల్లో అఖిల్ ప్రథమ బహుమతి సాధించాడన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉన్న విద్యార్థులను గుర్తించి గుంటూరు ఆర్కే పురం గురుకుల పాఠశాలలో గతనెల 29న పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన అఖిల్‌కు ప్రభుత్వం గన్నవరం నుంచి హైదరాబాద్ విమానంలో తీసుకు వెళ్లి చారిత్రక ప్రదేశాలను తిలకించే ఏర్పాట్లు చేసిందన్నారు. అఖిల్‌ను సాగనంపడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు కుటుంబరావు, కమలారత్నం మాట్లాడుతూ విమానాన్ని ఆకాశంలో వెళ్తుండగా చూడటమే తప్ప తమ బిడ్డ విమానంలో ప్రయాణిస్తాడని ఎన్నడూ ఊహించలేదని అన్నారు.