బోడిరెడ్డిపల్లె అంగన్‌వాడీ సెంటర్‌లో చిన్నారులకు అన్నప్రాసన చేస్తున్న దృశ్యం
అంగన్‌వాడీ చిన్నారులకు అన్నప్రాసన
Published Thu, Aug 4 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
పలమనేరు: మండలంలోని బోడిరెడ్డిపల్లె అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్ ఈశ్వరమ్మ తల్లిపాల ఆవశ్యకతను వారికి తెలియజేశారు. ముర్రుపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమానికి తల్లులు, బాలింతలు, గర్భిణులు హాజరయ్యారు. అంగన్‌వాడీ కార్యకర్త ఇంద్రాణీ పాల్గొన్నారు.
Advertisement
Advertisement