థియేటర్ దగ్ధం : ప్రేక్షకులు క్షేమం
దాచేపల్లి : మండలం నడికుడి గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణపురం అలంకార్(ఏసీ)«థియేటర్‌ను ఏడాదిన్నర క్రితం ఆధునికీకరణ చేసి పునఃప్రారంభించా రు. ప్రస్తుతం కబాలి సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్‌సర్కూ్యట్ సంభవించి థియేటర్ మొత్తం కాలి బూడిదైంది. సుమారు రూ.2 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. మ్యాట్నీ షో మరికొద్ది నిమిషాల్లో ప్రారంభ మవుతుందనగా జరిగిన ఈ ప్రమాదంలో థియేటర్ లోపలి భాగం మొత్తం కాలి బూడిదైంది. ప్రేక్షకులు మాత్రం జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో క్షేమంగా బయట పడ్డారు.