మాదాపూర్: హెచ్‌ఐవీతో పాటు ఎలోబా వైరస్ ప్రాణాంతకంగా మారిందని ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం డైరెక్టర్ (లండన్, యూకే) ప్రొఫెసర్ పీటర్ ఫియట్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్‌లో పలు వ్యాధులపై చర్చ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన పీటర్ మాట్లాడుతూ వైద్యరంగంలో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వివిధ వైరస్‌లతో ఆరోగ్యం దెబ్బతింటుందని వాటి నివారణ కోసం ఎప్పటికప్పుడు పరిశోధనలు త్వరితగతిన నిర్వహించి నివారించాలన్నారు. భారత్‌లో హెచ్‌ఐవీ వ్యాధి తగ్గుతోందన్నారు.
70 నుండి 80 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవీ వ్యాధి కారణంగా మరణించారన్నారు. 1981లో హెచ్‌ఐవీని కనుగొన్నట్లు పేర్కొన్నారు. క్రానిక్ వ్యాధుల వల్ల మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు కావాల్సిన కృషి చేయాలన్నారు. ఎబోలా వ్యాధి ఎక్కడెక్కడ..ఎలా ప్రబలిందో వివరించారు. నైజీరియా, కంబోడియా, మెక్సికో, ఫ్రాన్స్, పాకిస్తాన్, బ్రెజిల్, ఉగాండ తదితర ప్రాంతాల్లో ఎబోలా ఏవిధంగా ప్రజలను భయబ్రాంతులను చేసిందో వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రాణాంతకంగా ఎబోలా
Published Sun, Oct 9 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
Advertisement
Advertisement