గిరిజన విద్యార్థికి డెంగీ?
Published Sat, Jul 23 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
భయాందోళనలో ప్రజలు
కురుపాం : మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీదరపు జగదీష్ (15)కు డెంగీ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. జగదీష్ మూడు రోజులుగా మలేరియాతో బాధపడుతుండడంతో వసతిగహ సంక్షేమాధికారి చంద్రబాబు విద్యార్థిని కురుపాం సామాజిక ఆస్పత్రికి తలరించగా, అక్కడ వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి డెంగీ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో జగదీష్‌ను శనివారం హుటాహుటిన పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వారం కిందట కురుపాం మండల కేంద్రానికి చెందిన ఉల్కా ఉమామహేశ్వరరావు(33) అనే వ్యక్తికి కూడా డెంగీ సోకిన సంగతి తెలిసిందే. కురుపాం మండల కేంద్రంలో రెండు డెంగీ కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Advertisement