హిందూపురం రూరల్ : చలివెందల అటవీ ప్రాంతంలో వారం క్రితం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. ఓడీసీ మండలం బూచయ్యగారిపల్లికి చెందిన మునిస్వామి(48) మృతదేహంగా గుర్తించినట్లు హిందూపురం రూరల్ ఎస్‌ఐ ఆంజనేయులు బుధవారం విలేకరులకు తెలిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. భార్యతో కలిసి ఉంటున్న మునిస్వామికి కుటుంబ పోషణ భారం కావడంతో జీవితంపై విరక్తి చెంది వారం కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని భార్య చౌడమ్మకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు.