దిండిలో నకిలీ డీఐజీ హల్‌చల్ | Fake SP to create hulchal in Dindi mandal | Sakshi
Sakshi News home page

దిండిలో నకిలీ డీఐజీ హల్‌చల్

Published Sun, Jun 14 2015 4:51 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

దిండిలో నకిలీ డీఐజీ హల్‌చల్

దిండిలో నకిలీ డీఐజీ హల్‌చల్

తూర్పుగోదావరి జిల్లా(దిండి): ఓ నకిలీ డీఐజీ హల్‌చల్ చేసి చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దిండి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కార్తికేయన్, గ్రేహౌండ్స్ ఎస్పీ నని చెప్పి దిండి పోలీసుల నుంచి సకల సౌకర్యాలు పొందుతున్నాడు.

మంచి పేరున్న గ్రేహైండ్స్ డీఐజీ నిజంగానే వచ్చారనుకుని దిండి పోలీసులు నకిలీ డీఐజీకి శనివారం నుంచి సపర్యలు చేశారు. సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన చిరునోమల ఎసై విచారించగా నకిలీ డీఐజీ విషయం వెలుగు చూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

పోల్

Advertisement