ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలి
ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
నిర్మల్ రూరల్ : ప్రతీఒక్కరు ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. తెలంగాణ కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సెన్సయ్ చుక్క ధర్మరాజ్ స్వీయరక్షణపై రూపొందించిన పోస్టర్‌ను గురువారం తన కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, యువతులు, విద్యార్థినులు స్వీయరక్షణ కోసం తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాలని సూచించారు. సెన్సయ్ ధర్మరాజ్ మాట్లాడుతూ మహిళలపై తరచూ దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి సందర్భాల్లో స్వీయరక్షణ ఎలా చేసుకోవాలో సూచించేలా పోస్టర్ రూపొందించామన్నారు.
తమను తాము ఎలా రక్షించుకుని, ప్రతిదాడి చేయడం ఎలాగో ప్రత్యేకమైన స్వీయ రణక్ష కోర్సు ద్వారా వివరిస్తున్నామన్నారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని కళాశాలలు, విద్యాలయాల్లో విదార్థినులందరికీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్య శిక్షకులు తేజేందర్‌సింగ్, శ్రీకాంత్, భూషణ్, స్వామి, కీరం, లక్ష్మణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.