
ఎమ్మెల్యే సత్యప్రభ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ బుధవారం తన నివాసంలో ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయపడ్డారు. రాత్రి ఇంట్లోని తన గదిలో నడుస్తున్న సమయంలో కాలు జారి కిందపడ్డారు. హుటాహుటిన కుటుంబసభ్యులు ఆమెను బెంగళూరులోని వైదేహీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. గురువారం ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు కాలు ఎముక విరిగినట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. ఆమె రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె బెంగళూరులోని ఆస్పత్రిలోనే ఉన్నారు.