గుర్తింపు లేని ‘ప్రావీణ్యం’ | Meritorious sports student needs help | Sakshi
Sakshi News home page

గుర్తింపు లేని ‘ప్రావీణ్యం’

Published Sat, Aug 27 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

పతకాలు, ప్రశంసాపత్రాలతో కింతలి ప్రవీణ్‌కుమార్‌

పతకాలు, ప్రశంసాపత్రాలతో కింతలి ప్రవీణ్‌కుమార్‌

బొబ్బిలి రూరల్‌ :  పిరిడికి చెందిన కింతలి ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్రస్థాయి ట్రిపుల్‌జంప్, 4‘100 పరుగు పోటీలలో 2015లో ప్రథమ స్థానం సాధించాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాపియన్‌ షిప్‌ పోటీల్లో ట్రిపుల్‌జంప్‌లో ద్వితీయస్థానం, 4‘100 పరుగు పోటీల్లో ద్వితీయస్థానం సాధించాడు. రాష్ట్రస్థాయిలో రజతపతకాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నా ప్రోత్సాహం లేక.. పేదరికంతో వెనుకబడి ఉన్నాడు. రాజా కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
 
షూ కూడా కొనలేను: కింతలి ప్రవీణ్‌కుమార్, పిరిడి
కనీసం షూ కొనడానికి కూడా వీలుకాని పరిస్థితి నాది. క్రీడలంటే మక్కువ ఉన్నా పేదరికానికి తోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయిలో ఆడలేకపోతున్నాను. క్రీడలలో పూర్తిస్థాయి శిక్షణ అందించాలి. క్రీడా సామగ్రి, దుస్తులు కూడా అందించాలి.
 
ప్రభుత్వానికి పట్టని ప్రతిభా ‘కిరణం’
అలజంగికి చెందిన నారంశెట్టి సాయికిరణ్‌ మూగ, చెవిటి విద్యార్థి. విజయనగరంలోని పేర్ల రామమూర్తి శెట్టి డఫ్‌ అండ్‌ డంబ్‌ పాఠశాలలో పదో తరగతిలో 2012లో ప్రథమస్థానంలో నిలిచాడు. అనంతరం బాపట్ల బధిరుల ఏపీఆర్‌ఎస్‌లో ఇంటర్‌ చదివాడు. స్పెషల్‌ ఒలింపిక్స్‌లో 2008, 2009, 2010, 2011లో పరుగులో ప్రథముడిగా నిలిచాడు. 2013లో గుంటూరులో నిర్వహించిన వికలాంగుల పరుగు పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథముడిగా నిలిచాడు. ఏపీఎస్‌ ఆర్టీసీ, వికలాంగుల సంక్షేమ శాఖ 2011లో నిర్వహించిన 200 మీటర్ల పరుగులో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం సాధించాడు. జేసీఐ విశాఖ వారు జోన్‌స్థాయిలో నిర్వíß ంచిన 4‘400 పరుగు పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. తైక్వాండో పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇంత అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం విశాఖలో కంప్యూటర్‌ శిక్షణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని కాగితంపై రాసిచ్చాడు.
 
సొంతంగానే శిక్షణ:  నారంశెట్టి సాయికిరణ్, అలజంగి
నాకు నేనుగా శిక్షణ పొందుతున్నాను. నిత్యం సాధన చేస్తున్నాను. అయినా ఎవరినుంచీ ప్రోత్సాహం లేక క్రీడా పోటీల్లో పాల్గొనలేకపోతున్నాను. ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎవరూ సహకరించడం లేదు.
 
 

Advertisement
Advertisement