కల్వకుంట్ల, జువ్వాడీ బల ‘సమీక్ష’
Published Sun, Jul 24 2016 9:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
కోరుట్ల : కోరుట్లలో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష బలపరీక్షకు వేదికకానుంది. జువ్వాడి రాకతో మారిన రాజకీయ పరిణామాలు ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేపుతున్నాయి. పార్టీ పెద్దల ముందు జువ్వాడి వర్గం కోరుట్ల సెగ్మెంట్‌లో తమ పట్టు నిరూపించుకునే యత్నాలు చేసింది. ఎమ్మెల్యే సైతం కార్యకర్తల సమీక్షరణకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీలు వర్గాలు చర్చించుకుంటున్నాయి. పాత..కొత్త తేడాలు లేకుండా అంతా కలిసి ఉంటామని ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఇరువర్గాలు గతంలో చెప్పుకున్నాయి. కోరుట్ల సెగ్మెంట్‌లో రెండువర్గాలు ఆధిపత్యంకోసం సాగిస్తున్న యత్నాలు ఆసక్తికరంగా మారాయి.
కల్వకుంట్ల, జువ్వాడి వర్గాలు ప్రస్తుతం ఒకేపార్టీలో ఉన్నా ఒకే వేదికపై ఒక్కసారి కనిపించలేదు. హరితహారం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కల్వకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొందగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి జువ్వాడి నర్సింగరావు రెండోస్థానంలో నిలిచారు. నెలక్రితం సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చే రారు. వారంరోజులకు జువ్వాడి వర్గం కోరుట్లలో పెద్దఎత్తున కార్యకర్తలు, అనుచరులను సమీకరించి ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి తమ పట్టు నిరూపించుకునే యత్నం చేశారు. కల్వకుంట్ల వర్గం నాయకుల్లోనూ ఇదే పట్టు ప్రదర్శించాలన్న తపన మొదలైంది. సోమవారం సెగ్మెంట్ సమీక్ష సమావేశం ఇందుకు వేదికగా నిలువనుందని పార్టీవర్గాల సమాచారం.
Advertisement