సేంద్రియ పంట.. ఆరోగ్యమే ఇంట | sendriya panta.. arogyame inta | Sakshi
Sakshi News home page

సేంద్రియ పంట.. ఆరోగ్యమే ఇంట

Published Sun, Jul 24 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

sendriya panta.. arogyame inta

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :  సేంద్రియ ఆహారోత్పత్తులు.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయని, వీటిని ఆహారంగా తీసుకుంటే వ్యాధులు దరిచేరవని అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఎంహెచ్‌ షరీఫ్‌ తెలిపారు. స్థానిక ఐఏడీపీ హాలులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన శనివారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు ద్వారా పండించిన ఆహారోత్పత్తులపై రైతుల్లో, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. సేంద్రియ పంటల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, బియ్యం, పప్పు లు, ఔషధాలను ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్షీ్మశ్వరి, వ్యవసాయ శాఖ డీడీ అనురాధ, ప్రసాద్, తాతారావు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement