వేంకటేశ్వరస్వామికి వెండి కిరీటం సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం జువ్వలపాలెం రోడ్డులో వేంచేసియున్న పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారికి దాతలు నామన రామారావు– సుధ దంపతులు రూ.2 లక్షల విలువగల మూడు కిలోల వెండి కిరీటం సమర్పించారు. అలాగే బొక్కా కృష్ణమోహనరావు–నాగరత్నం దంపతుల కుమారుడు బొక్కా వెంకటేశ్వర్లు(అమెరికా)స్వావిువారికి రూ.లక్ష విలువైన రెండు కిలోల వెండి పాదాలు బహూకరించారు. వీటిని అర్చకులు స్వామివారికి అలంకరించారు. కార్యక్రమంలో ధర్మకర్త మంతెన రామ్‌కుమార్‌రాజు, ఆలయ ఈవో రుద్రరాజు గంగా శ్రీదేవి పాల్గొన్నారు.