
యువతి అదృశ్యం
కడప అర్బన్ : కడప నగరంలోని టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ముత్యాల రామయ్య వీధిలో నివసిస్తున్న రుక్సార్‌బేగం (17) అనే యువతి ఈ నెల 6 నుంచి కనిపించడం లేదని తల్లి గులాబ్‌జాన్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అమర్‌నాథరెడ్డి తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 08562–241387, ఎస్‌ఐ 94407 96912, సీఐ 94407 96990 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని పేర్కొన్నారు.