సమ్మర్ డ్రింక్
బీట్‌రూట్ జింజర్ జ్యూస్
కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్స్ - 2
అల్లం ముక్కలు - పావుకప్పు
నీళ్లు - 1 కప్పు
తేనె - 2 చెంచాలు
నిమ్మరసం - అరచెంచా
తయారీ విధానం:
బీట్‌రూట్స్‌ని చెక్కు తీసి, శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసుకోవాలి; తర్వాత ఈ ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి; కొంచెం మెత్తబడ్డాక అల్లం ముక్కలు కూడా వేసి మరి కాసేపు బ్లెండ్ చేయాలి; బాగా పేస్ట్‌లా అయ్యాక నీరుపోసి ఓ ఐదు నిమిషాల పాటు బ్లెండ్ చేసి తీసేయాలి; చివరగా గ్లాసుల్లో పోసి... తేనె నిమ్మరసం కలిపి, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ జ్యూస్ దాహార్తిని తీర్చడమే కాక శక్తిని కూడా ఇస్తుంది.