పల్లవి :
అతడు: అమ్మో... అరె...
అమ్మో అమ్మో ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ
పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ
పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ
ఆమె: అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ
పుణ్యమెంత చేశానో పున్నమిరేడా
పుట్టావా నాకోసం ముద్దుల మగడా
చరణం : 1
అ: అమ్మో చెయ్యేసి చూడు ఒళ్లంత సెగలు సెగలు
అబ్బో వాటేసి చూడు కళ్లల్లో పొగలు పొగలు
ఆ: అమ్మో చెవిపెట్టి చూడు గుండెల్లో గుబులు గుబులు
అబ్బో ముద్దాడి చూడు బుగ్గల్లో వగలు వగలు
అ: ఇద్దరమూ ఒకటైతే ఇంకేముంది
ఆ: ముద్దు ముద్దు ఒకటైతే హద్దేముంది
అ: కలిసిపోయి కరిగిపోయి కౌగిలిలో తడిసిపోయి
ఉందామా కలకాలం ఒకే తనువుగా
ఆ: అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ
అ: పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ
పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ
చరణం : 2
ఆ: అయ్యో ఈ పాడు మనసు రేగిందా చిత్తు చిత్తు
అబ్బీ ఈ పాలపొంగు ఊగిందా మత్తు మత్తు
అ: అయ్యో ఈ కోడె వయసు అలిగిందా పోరు పోరు
అమ్మీ ఈ వలపు దెబ్బ అదిరిందా హోరు హోరు
ఆ: కైపంతా కళ్లల్లో కాపురముంటే
అ: పగలేమిటి రేయేమిటి రెండూ ఒకటే
ఆ: ఒకరికొకరు ఓడిపోయి ఒడిలోపల ఒదిగిపోయి
ఉందామా కలకాలం ఒకే మనువుగా
॥అమ్మో॥॥అబ్బో॥
చిత్రం : అల్లుడుగారు (1990)
రచన : రసరాజు
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
- నిర్వహణ: నాగేష్