K.V. Mahadevan
-
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
అక్కినేనికి నివాళి పల్లవి : టాటా వీడుకోలు... గుడ్ బై ఇంక సెలవు (2) తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా ॥ చరణం : 1 ప్రియురాలి వలపులకన్నా నులివెచ్చనిదేదీ లేదని (2) నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది ఆ... ప్రేమనగరుకే పోతాను పోతాను పోతాను... ఈ కామనగరుకే రాను... ఇక రాను ॥ చరణం : 2 ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని లేటుగ తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను ఆ... స్నేహనగరుకే పోతాను పోతాను పోతాను... ఈ మోహనగరుకు రాను... ఇక రాను ॥ చరణం : 3 మధుపాత్రకెదలో ఇంక ఏమాత్ర ం చోటులేదని మధుపాత్రకెదలో ఇంక ఏమాత్ర ం చోటులేదని మనసైన పిల్లే చెప్పింది... (2) నా మనసంతా తానై నిండింది (2) నే రాగనగరుకే పోతాను అనురాగనగరుకే పోతాను పోతాను... చిత్రం : బుద్ధిమంతుడు (1969) రచన : ఆరుద్ర సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఘంటసాల -
గీత స్మరణం
పల్లవి : ఆమె: తుమ్మెదా... ఓ తుమ్మెదా... ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా ॥ అతడు: మగడులేని వేళ తుమ్మెదా వచ్చి మొగమాట పెడతాడే తుమ్మెదా ఆ: మాట వరసకంటూ తుమ్మెదా పచ్చి మోటసరసమాడే తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడే తుమ్మెదా ॥ చరణం : 1 ఆ: ఎదురుపడితే కదలనీక దడికడతాడే పొదచాటుకు పద పదమని సొదపెడతాడే ॥ అ: ఒప్పనంటే వదలడమ్మా ముప్పు తప్పదంటే బెదరడమ్మా ॥ చుట్టుపక్కలే మాత్రం చూడని ఆత్రం పట్టు విడుపులేనిదమ్మా కృష్ణుని పంతం ॥॥ చరణం : 2 ఆ: తానమాడువేళ తాను దిగబడతాడే మాను మాటు చేసి చూడ ఎగబడతాడే ॥ అ: చెప్పుకుంటే సిగ్గుచేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు ॥ ఆ: ఆదమరచి ఉన్నావా కోకలు మాయం ఆనక ఏమనుకున్నా రాదే సాయం ॥॥ చిత్రం : శ్రీనివాస కళ్యాణం (1987) రచన : సిరివెన్నెల సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఎస్.పి.బాలు, పి,సుశీల నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : అతడు: అమ్మో... అరె... అమ్మో అమ్మో ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ ఆమె: అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ పుణ్యమెంత చేశానో పున్నమిరేడా పుట్టావా నాకోసం ముద్దుల మగడా చరణం : 1 అ: అమ్మో చెయ్యేసి చూడు ఒళ్లంత సెగలు సెగలు అబ్బో వాటేసి చూడు కళ్లల్లో పొగలు పొగలు ఆ: అమ్మో చెవిపెట్టి చూడు గుండెల్లో గుబులు గుబులు అబ్బో ముద్దాడి చూడు బుగ్గల్లో వగలు వగలు అ: ఇద్దరమూ ఒకటైతే ఇంకేముంది ఆ: ముద్దు ముద్దు ఒకటైతే హద్దేముంది అ: కలిసిపోయి కరిగిపోయి కౌగిలిలో తడిసిపోయి ఉందామా కలకాలం ఒకే తనువుగా ఆ: అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ అ: పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ చరణం : 2 ఆ: అయ్యో ఈ పాడు మనసు రేగిందా చిత్తు చిత్తు అబ్బీ ఈ పాలపొంగు ఊగిందా మత్తు మత్తు అ: అయ్యో ఈ కోడె వయసు అలిగిందా పోరు పోరు అమ్మీ ఈ వలపు దెబ్బ అదిరిందా హోరు హోరు ఆ: కైపంతా కళ్లల్లో కాపురముంటే అ: పగలేమిటి రేయేమిటి రెండూ ఒకటే ఆ: ఒకరికొకరు ఓడిపోయి ఒడిలోపల ఒదిగిపోయి ఉందామా కలకాలం ఒకే మనువుగా ॥అమ్మో॥॥అబ్బో॥ చిత్రం : అల్లుడుగారు (1990) రచన : రసరాజు సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర - నిర్వహణ: నాగేష్