దుబాయ్: గగనంలో స్వర్గాన్ని తలపిస్తూ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద ఎయిర్‌లైనర్ ఎమిరేట్స్ తన విమానాల్లో అత్యంత అధునాతన ఫస్ట్‌క్లాస్ ప్రైవేట్ సూట్స్‌ను ప్రారంభించింది. ఈ సూట్స్‌లో విండోలు లేకుండా గగనతలాన్ని ప్రతిబింబించేలా వర్చువల్ విండోస్‌ను అమర్చారు.విమానంలో పొందుపరిచిన ఫైబర్ ఆప్టిక్ కెమెరాల ద్వారా బయటి ప్రపంచపు అందాలను వీక్షించే వెసులుబాటు కల్పించారు.
క్యాబిన్ సిబ్బందిని కనెక్ట్ చేసేందుకు అన్ని సూట్లలో వీడియో కాల్ సౌకర్యం ఉంది. దుబాయ్ ఎయిర్‌షోలో ఈ క్యాబిన్‌ను ఎమిరేట్స్ అధ్యక్షుడు టిమ్ క్లార్క్ ప్రారంభించారు. ఈ సూట్ ఖరీదు ఎంతనేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 777లో ప్రైవేట్ సూట్స్ అందుబాటులోకి రానున్నాయి.
నూతన ఫస్ట్‌క్లాస్ ప్రోడక్ట్‌ను అత్యాధునిక సదుపాయాలతో రీడిజైన్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఎకానమీ, బిజినెస్ క్లాస్ క్యాబిన్‌లలోనూ నూతన మార్పులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment