శ్రీమతి... అందాల బహుమతి
వన్నెచిన్నెలు... వయ్యారాలు... టీనేజర్లకూ, పెళ్లికాని అమ్మాయిలకు మాత్రమే అనుకునే రోజులకు కాలం చెల్లిందని మరోసారి నిరూపించారా మహిళలు. మిసెస్ ప్లానెట్, మిసెస్ ఏసియా ఇంటర్నేషనల్ పోటీలకు సంబంధించిన ఆడిషన్స్ గచ్చిబౌలిలోని హాలిడే ఇన్ ఎక్స్‌ప్రెస్ హోటల్‌లో శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ర్యాంప్‌వాక్ చేసిన మహిళలు... న్యాయమూర్తులుగా వ్యవహరించిన పలువురు మాజీ, ప్రస్తుత మిసెస్ ఇంటర్నేషనల్ విజేతల ప్రశంసలు అందుకున్నారు. వీరిలో ఏడుగురిని పూనెలో జరిగే సెమీఫైనల్స్‌కు ఎంపిక చేశామని నిర్వాహకసంస్థ ప్రతినిధి దీపాలి ఫడ్నిస్ చెప్పారు.