అమ్మ నాన్నల బాటలో అందగత్తెలు | glamour queens are following their parents | Sakshi
Sakshi News home page

అమ్మ నాన్నల బాటలో అందగత్తెలు

Published Sun, Dec 22 2013 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

అమ్మ నాన్నల  బాటలో అందగత్తెలు

అమ్మ నాన్నల బాటలో అందగత్తెలు

 అనంతరం
 
 సునీల్‌శెట్టి కూతురు అథియా ఫారిన్‌లో చదువు ముగించి వచ్చింది. ఆమెను నటిని చేయాలని సునీల్ కోరిక. ఆమె కూడా నటిగానే సెటిలవ్వాలని అనుకుంటోందని సమాచారం.
 
 హేమామాలిని చిన్న కూతురు అహనా మంచి డ్యాన్సర్. అక్క ఇషా సినిమాల్లోకి వచ్చినా ఫెయిలైంది. అహనా మాత్రం నటన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఇప్పుడు ఆలోచిస్తోందట. వచ్చే యేడు ఆమె నటిగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 
 జాకీష్రాఫ్‌కి కూతురు కృష్ణ్ణ అంటే ప్రాణం. ఆమె ఏం చేస్తానన్నా చేయమంటాడు. కానీ కృష్ణకి నటి కావాలని లేదు. కానీ ఆమె ఇంటి ముందు నిర్మాతల క్యూ మాత్రం ఉంది.
 
 ఎట్టకేలకు కమల్‌హాసన్ చిన్న కూతురు అక్షర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. డెరైక్టర్ అవుదామనుకున్న ఆమె... మనసు మార్చుకుంది. ఓ బాలీవుడ్ సినిమాతో వచ్చే యేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
 శ్రీదేవికి సినిమాల్లోకి వచ్చాక క్రేజ్ ఏర్పడితే, ఆమె పెద్ద కూతురు జాహ్నవి ఇంకా ఎంటర్ అవకుండానే స్టార్ అయిపోయింది. ఆమె రాక కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లెక్కల ప్రచారం ఆమె వచ్చే యేడు వెండితెర మీద మెరవవచ్చు.
 
 తన కూతురు ఇష్టపడితే నటి అవుతుంది అంటూ సైఫ్ చెబితే... నాన్న ఒప్పుకున్నా నాకు సినిమాల్లోకి వెళ్లాలని లేదు అనేది సారా. కానీ ఈ మధ్య మనసు మార్చుకుందని, త్వరలోనే సినిమాల్లోకి రానుందని అంతా అంటున్నారు.
 
 
 ఆమిర్‌ఖాన్ కొడుకు డెరైక్షన్ ఫీల్డ్‌కి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూతురు ఇరా మీదే అందరి కళ్లూ. ఆమె సినిమా సంగతి  తేల్చడం లేదు... తనకి నటన ఇష్టమేనంటారు ఆమె ఫ్రెండ్స్!

తండ్రులంతా తమ కొడుకులను తాము నడిచిన బాటలో నడపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొడుకులు కూడా తండ్రిని రోల్‌మోడల్‌గా, హీరోగా భావించి అనుసరిస్తారు. అదే విధంగా కూతుళ్లు తల్లిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆమెలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం అలాంటి భేదాలేమీ ఉండవు. కొడుకా, కూతురా అన్న తేడాలేవీ కనిపించవు. ఇంకా చెప్పాలంటే... తల్లి సాగిన దారిలోనో, తండ్రి పరచిన బాటలోనో తమ ప్రయాణాన్ని సాగించాలని కొడుకుల కంటే కూతుళ్లే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. దానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి.
 
 అనిల్‌కపూర్ వారసురాలు సోనమ్, శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి, శక్తికపూర్ కూతురు శ్రద్ధ, షర్మిలా ఠాగూర్ కూతురు సోహా, హేమమాలిని కూతురు ఇషా... ఇలా చాలామంది కూతుళ్లు తెరమీద వెలుగుతున్నారు. వారిలాగే మరికొంతమంది వెలిగేందుకు సిద్ధంగా ఉన్నారు. సినీ పెద్దల అంచనాల ప్రకారం... వచ్చే యేడు చాలామంది తారల పుత్రికలు వెండితెర మీద సొగసుల సంతకం చేయనున్నారు. ఇదిగో... వీరే వారు. అన్నీ కలిసొస్తే వీరి ఎంట్రీ త్వరలో ఖాయమవుతుంది. వారి తల్లిదండ్రుల పేరు నిలిపే బాధ్యత వీరిపై పడుతుంది. వీరి రాకతో వెండితెర మరింత
 అందాన్ని సంతరించుకుంటుంది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement