Sunil shetty daughter athiya
-
అతియా శెట్టి- కేఎల్ రాహుల్ వెడ్డింగ్.. డేట్ ఫిక్స్..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మూడేళ్లుగా సీక్రెట్ డేటింగ్లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్గా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాజాగా ఈ జంట పెళ్లి తేదీలపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి నెలలోనే వీరు ఒక్కటవబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి.. ఎప్పుడో సునీల్ శెట్టి చెప్పేశాడుగా..!) అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ఓ విలాసవంతమైన వేదికను ఖరారు చేసినట్లు సమాచారం. జనవరి 21,22, 23 తేదీల్లో హల్దీ, మెహెందీ, సంగీత్, గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్ - జహాన్లో దక్షిణ-భారత సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఇరువురి కుటుంబ సభ్యులు డిసెంబర్ చివరి నాటికి వివాహ ఆహ్వానాలను పంపనున్నట్లు సమాచారం. కాగా.. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన సూరజ్ పంచోలీతో కలిసి 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’ సినిమాతో అతియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరి సారిగా ‘మోతీచూర్ చక్నాచూర్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ ‘హోప్ సోలో’లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. -
కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి.. ఎప్పుడో సునీల్ శెట్టి చెప్పేశాడుగా..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. గతంలో పలుసార్లు వీరిద్దరూ కలిసి జంటగా కనిపించి సందడి చేశారు. మూడేళ్లుగా సీక్రెట్ డేటింగ్లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్గా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాజాగా వీరి రిలేషన్‌పై అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి స్పందించారు. (చదవండి: క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అతియా శెట్టి) ధారావి బ్యాంక్ మూవీ ఈవెంట్లో పాల్గొన్న సునీల్ శెట్టిని కేఎల్ రాహుల్‌తో మీ కుమార్తె వివాహం ఎప్పడని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. 'త్వరలోనే జరుగుతుంది(జల్దీ హోగీ). మరో మూడు నెలల్లో పెళ్లికి ఆహ్వానిస్తారనుకుంటున్నా' అని సమాధానమిచ్చారు. అయితే కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహాన్ని ఐదు-నక్షత్రాల హోటల్లో కాకుండా.. ఖండాలాలోని సునీల్ శెట్టి నివాసం 'జహాన్'లో పెళ్లి వేడుక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా..2015లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ 2019 'మోతీచూర్ చక్నాచూర్' చిత్రంలో చివరిగా కనిపించింది. -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్‌లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్‌తో కల్యాణి -

అమ్మ నాన్నల బాటలో అందగత్తెలు
అనంతరం సునీల్‌శెట్టి కూతురు అథియా ఫారిన్లో చదువు ముగించి వచ్చింది. ఆమెను నటిని చేయాలని సునీల్ కోరిక. ఆమె కూడా నటిగానే సెటిలవ్వాలని అనుకుంటోందని సమాచారం. హేమామాలిని చిన్న కూతురు అహనా మంచి డ్యాన్సర్. అక్క ఇషా సినిమాల్లోకి వచ్చినా ఫెయిలైంది. అహనా మాత్రం నటన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఇప్పుడు ఆలోచిస్తోందట. వచ్చే యేడు ఆమె నటిగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జాకీష్రాఫ్కి కూతురు కృష్ణ్ణ అంటే ప్రాణం. ఆమె ఏం చేస్తానన్నా చేయమంటాడు. కానీ కృష్ణకి నటి కావాలని లేదు. కానీ ఆమె ఇంటి ముందు నిర్మాతల క్యూ మాత్రం ఉంది. ఎట్టకేలకు కమల్‌హాసన్ చిన్న కూతురు అక్షర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. డెరైక్టర్ అవుదామనుకున్న ఆమె... మనసు మార్చుకుంది. ఓ బాలీవుడ్ సినిమాతో వచ్చే యేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవికి సినిమాల్లోకి వచ్చాక క్రేజ్ ఏర్పడితే, ఆమె పెద్ద కూతురు జాహ్నవి ఇంకా ఎంటర్ అవకుండానే స్టార్ అయిపోయింది. ఆమె రాక కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లెక్కల ప్రచారం ఆమె వచ్చే యేడు వెండితెర మీద మెరవవచ్చు. తన కూతురు ఇష్టపడితే నటి అవుతుంది అంటూ సైఫ్ చెబితే... నాన్న ఒప్పుకున్నా నాకు సినిమాల్లోకి వెళ్లాలని లేదు అనేది సారా. కానీ ఈ మధ్య మనసు మార్చుకుందని, త్వరలోనే సినిమాల్లోకి రానుందని అంతా అంటున్నారు. ఆమిర్‌ఖాన్ కొడుకు డెరైక్షన్ ఫీల్డ్కి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూతురు ఇరా మీదే అందరి కళ్లూ. ఆమె సినిమా సంగతి తేల్చడం లేదు... తనకి నటన ఇష్టమేనంటారు ఆమె ఫ్రెండ్స్! తండ్రులంతా తమ కొడుకులను తాము నడిచిన బాటలో నడపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొడుకులు కూడా తండ్రిని రోల్‌మోడల్‌గా, హీరోగా భావించి అనుసరిస్తారు. అదే విధంగా కూతుళ్లు తల్లిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆమెలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్లో మాత్రం అలాంటి భేదాలేమీ ఉండవు. కొడుకా, కూతురా అన్న తేడాలేవీ కనిపించవు. ఇంకా చెప్పాలంటే... తల్లి సాగిన దారిలోనో, తండ్రి పరచిన బాటలోనో తమ ప్రయాణాన్ని సాగించాలని కొడుకుల కంటే కూతుళ్లే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. దానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అనిల్‌కపూర్ వారసురాలు సోనమ్, శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి, శక్తికపూర్ కూతురు శ్రద్ధ, షర్మిలా ఠాగూర్ కూతురు సోహా, హేమమాలిని కూతురు ఇషా... ఇలా చాలామంది కూతుళ్లు తెరమీద వెలుగుతున్నారు. వారిలాగే మరికొంతమంది వెలిగేందుకు సిద్ధంగా ఉన్నారు. సినీ పెద్దల అంచనాల ప్రకారం... వచ్చే యేడు చాలామంది తారల పుత్రికలు వెండితెర మీద సొగసుల సంతకం చేయనున్నారు. ఇదిగో... వీరే వారు. అన్నీ కలిసొస్తే వీరి ఎంట్రీ త్వరలో ఖాయమవుతుంది. వారి తల్లిదండ్రుల పేరు నిలిపే బాధ్యత వీరిపై పడుతుంది. వీరి రాకతో వెండితెర మరింత అందాన్ని సంతరించుకుంటుంది!