
శిథిలమవ్వని వైభవం!
క్రీస్తుపూర్వపు మానవుడి నిర్మాణ నైపుణ్యతకు నిలువెత్తు సాక్ష్యం రోమన్ కలోజియం. గ్లాడియేటర్ల మధ్య జరిగిన యుద్ధ విన్యాసాలకు లక్షల మంది వీక్షకులతో పాటు తనూ ప్రేక్షకపాత్ర వహించిన కలోజియం చాలా వరకూ శిథిలం అయ్యింది. అయితే దీని వైభవం మాత్రం వర్ధిల్లుతోంది. రోమ్‌నగరంలో కొలువైన దీన్ని అనునిత్యం కొన్ని వేల మంది సందర్శిస్తున్నారు. అలా ఒక వర్షాకాలపు సాయంత్రం వీక్షకులతో కన్నుల పండువగా ఉన్న కలోజియం.