అరాఫత్‌లో హజ్ యాత్రికుడి మృతి | makkah pilgrim die in arafat | Sakshi
Sakshi News home page

అరాఫత్‌లో హజ్ యాత్రికుడి మృతి

Published Mon, Sep 12 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

makkah pilgrim die in arafat

సాక్షి, హైదరాబాద్: మక్కా సమీపంలోని అరాఫత్‌లో ఆదివారం హజ్ యాత్రికుడు ముజీబ్-ఉర్-రహ్మన్(70) మృతి చెందారు. హైదరాబాద్‌లోని నవాబ్ సాబ్ కుంటకు చెందిన రహ్మన్ తన కూతురు, అల్లుడితో కలసి రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లారు.

కాగా, అక్కడ ఒక్కసారిగా అనారోగ్యానికి గురై సహజ మరణం పొందారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సహకరించాలని ఖాదీమ్-ఉల్ హుజ్జాజ్‌కు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్‌ఏ షుకూర్ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement