నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా ఉగ్రవాద ఆఫర్ ఇచ్చిన అరాఫత్!
బెంగళూరు : ఉగ్రవాద ఆరోపణల పై అరెస్ట్ అయిన సయ్యద్ ఇస్మయిల్ అ ఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లు పోలీ సుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 2013 ఫిబ్రవరిలో జరిగిన బాంబుపేలుళ్లు, పూనెలోని జర్మన్‌బేకరి పేలుళ్ల వెనుక వీరి ముగ్గురి హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సోదాల్లో వీరి వద్ద దొరికిన వస్తువులు, పేలుళ్ల సమయంలో అక్కడ దొరికొని వస్తులవులతో పోల్చి చూసిన పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. బాంబుల తయారీ, రవాణా లో అఫక్ ఆదేశాలను అనుసరించి మిగి లిన ఇద్దరూ పనిచేసేవారని తెలుస్తోంది. అఫక్ బాంబుల తయారీకి సంబంధించి పాకిస్తాన్‌లో శిక్షణ పొందాడని పోలీసులు భావిస్తున్నారు. హోమియోపతిపై పరి జ్ఞానం ఉన్న అఫక్ యువకులను అందులోనూ ఇంగ్లిషు, ఐటీతోపాటు వైద్య విధానాలపై పరిజ్ఞానం ఉన్న వారిని ఉగ్రవాదం పై ఆకర్షితులను చేసేందుకు య త్నించేవాడని సమాచారం.
ఇందుకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా విద్యార్థులతో సంభాషించేవాడు. ఇతని వలలో పడిన విద్యార్థులను కలుసుకోవడానికి నేరుగా వారు చదువుతున్న విద్యాసంస్థల వద్దేకే వెళ్లేవాడు. తద్వారా మరికొంత మందిని కలుసుకోవడానికి వీలవుతుందని అఫక్ భావించేవాడు. ఇతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషించి పోలీసులు ఈ విషయా లు తెలుసుకున్నారు. ఇదిలా ఉం డగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక వీరి హస్తం ఉన్న ట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో వీరి ముగ్గురిని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కు అప్పగించాలని పోలీసులు నిర్ణయిం చారు. ఎన్‌ఐఏ అధికారులు త్వరలో బెం గళూరుకు వచ్చి వీరి ముగ్గురుని అదుపులోకి తీసుకోనున్నారని పో లీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా తమ కుమారులు అమాయకులని, అనవసరంగా కేసులో ఇరికిం చారని వారి తల్లిదండ్రులు బెంగళూరులో శనివారం మీడియా సమావేశంలో కన్నీరుమున్నీరుగా విలపించారు.
త్వరలో ఎన్‌ఐఏకు నిందితుల అప్పగింత
Published Sun, Jan 11 2015 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement
Advertisement