networking
-
5G సేవలు ఎన్నో అవకాశాలు కల్పిస్తాయి : ప్రధాని నరేంద్ర మోదీ
-
సందర్భం: నెట్వర్కింగ్ క్వీన్..జయశ్రీ ఉల్లాల్
‘భవిష్యత్ అనేది మూసిపెట్టిన పెట్టెలాంటిది. అందులో నీ కోసం ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తుంటాయి’ అనే ఆంగ్ల సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే ‘అవును. నిజమే’ అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. ఫోర్బ్స్ ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సాధించిన జయశ్రీ ఉల్లాల్ విజయాలను చూస్తే ఆ డైలాగ్‌లోని సత్యం మరింత బలపడుతుంది. ఊహకు కూడా అందని అద్భుతాలు ఆమె జీవితంలో జరిగాయి... లండన్‌లో పుట్టిన జయశ్రీ దిల్లీలో పెరిగింది. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్వర్కింగ్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సిస్కో’లో చేరింది. ‘అలా జరుగుతుందనుకోలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది జయశ్రీ. ఆ కంపెనీలో ఆమె కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే. అయితే పదిహేను సంవత్సరాలు ఆ కంపెనీతో కలిసి నడిచింది. కంపెనీ సీయివో జాన్ చాంబర్, తన బాస్ మారియో మజోలా విలువైన ప్రోత్సాహం తో ‘జీరో’ స్థానంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. ‘ఈ స్థాయికి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది వినమ్రంగా జయశ్రీ. నిజమే మరీ, అది నల్లేరు మీద నడకలాంటి ప్రయాణం కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే కత్తి మీద సాము. తన తెలివితేటలు, వ్యూహాలు, దార్శనికతను ఏకం చేసి కంపెనీకి శక్తి ఇచ్చింది. తనలోని ‘శక్తి’ని కంపెనీ గుర్తించేలా చేసుకుంది. మూడు దశాబ్దాల నెట్వర్కింగ్ అనుభవం ఉన్న జయశ్రీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (2015), వరల్డ్స్ బెస్ట్ సీయివో (2018) అవార్డ్లు అందుకుంది. ‘టెక్ల్యాండ్ అనేది పురుషుల ప్రపంచం అనే భావన ఉంది’ అనే సందేహానికి జయశ్రీ స్పందన: ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబజీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. ‘సిస్కో’లో పనిచేసే కాలంలో కొన్ని నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో డోలాయమాన స్థితిలో ఉండిపోయింది. ‘ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? తిరిగి ఉద్యోగంలో చేరాలా?’ ‘ఇంటికే పరిమితమై మాతృత్వాన్ని ఆస్వాదించాలి’ అని కొన్నిసార్లు...‘మళ్లీ ఉద్యోగం చేయాల్సిందే. నేను సాధించాల్సింది ఎంతో ఉంది’ అని కొన్నిసార్లు అనిపించేది. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాతో ఒక బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు కెరీర్లో దూసుకుపోయింది. జయశ్రీ భర్త సెమికండక్టర్–ఇండస్ట్రీలో హైటెక్ ఎగ్జిక్యూటివ్. అలా అని ఇంట్లో సాంకేతిక కబుర్లు మాత్రమే వినిపిస్తాయి అనుకోవద్దు. దంపతులిద్దరూ ఇద్దరు కూతుళ్లతో సరదా సరదాగా గడుపుతారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు. హాయిగా పాటలు పాడుకుంటారు. వీటి ద్వారా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ ‘అరిస్టా’కు ప్రెసిడెంట్‌గా... సీయీవోగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, ఆ సంస్థను శక్తిమంతం చేయడం ద్వారా తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఆహారం, కుటుంబ విలువలు, సంస్కృతి పరంగా తనను తాను భారతీయురాలిగా చెప్పుకునే జయశ్రీ బిజినెస్ ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనా విధానంలో మాత్రం తాను ‘గ్లోబల్ సిటిజన్’ అంటుంది. ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. -
నెట్లో ఎస్ఎస్ ప్రశ్నపత్రాలు!
► పరీక్షకు ముందే ► యూ ట్యూబ్‌లో ప్రత్యక్షం ► యాన్యువల్ పరీక్షల్లా ► జరుపుతున్నామని చెప్పినా ప్రశ్న పత్రాలు లీక్ ► ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఇవ్వడంతో వెలుగులోకి.. ► విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వల్లే పేపర్ లీక్ అంటున్న యాజమాన్యాలు ప్రకాశం: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమికోన్నత విద్యను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమగ్ర మూల్యాంకనం (సమ్మెటివ్ అస్సెస్మెంట్) కోసం తయారు చేసిన ప్రశ్నపత్రాలు ముందే లీక్ అయ్యాయి. రెండు రోజుల తరువాత జరగాల్సిన సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్న పత్రాలు ముందుగానే యూట్యూబ్‌లో పెట్టేశారు. వీటిని గమనించిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు రేపటి ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో ఎప్పుడు పెడతారంటూ చాటింగ్ చేసిన తీరు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది అవసరం ఉండవు. చిన్న వయస్సులో వారికి పోటీ పడేలా పరీక్షలు నిర్వహించి భారం పెట్టకూడదని పదో తరగతినే ప్రామాణికం చేశారు. కానీ కొందరు ఉపాధ్యాయులు దీన్ని అలుసుగా తీసుకుని విద్యార్థులకు చదువు చెప్పడం మానేశారు. వారి వారి వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో సమగ్ర మూల్యాంకనం (సమ్మెటివ్ అస్సెస్మెంట్) పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సమ్మెటివ్ అస్సెస్మెంట్–3 (ఎస్ఏ–3) నడుస్తోంది. ఒక పాఠశాల జవాబు పత్రాలను మరో పాఠశాల ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంది. తద్వారా విద్యార్థి ప్రతిభ బయటపడుతుంది. 8,9 తరగతుల విద్యార్థుల జవాబు పత్రాలను పూర్తిగా ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, 6,7 తరగతుల వారివి కనీసం 15 శాతం మందివి ఇతర ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంది. బోర్డుపై జవాబులు రాసి విద్యార్థులచే పరీక్షలు రాయిస్తున్న పాఠశాలలు ఈ విధానం వలన దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దీంతో విద్యాశాఖాధికారులతో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతతో ప్రశ్నపత్రాల సరఫరా.. సమగ్ర మూల్యాంకనం పరీక్షల నిర్వహణకు తయారు చేస్తున్న ప్రశ్నపత్రాలను ఆయా మండలాల ఎమ్మార్సీలకు చేరుస్తారు. అక్కడ ఒక పెట్టెలో భద్రపరిచి పాఠశాల యాజమాన్యం, ఎంఈవో వద్ద రెండు తాళాలు పెట్టుకుంటారు. ఇలా ఏరోజు ప్రశ్న పత్రాలను అదే రోజు అరగంట ముందు ఎమ్మార్సీకి వెళ్లి ప్రశ్నపత్రాలను తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి జరగాల్సిన పరీక్షకు ప్రశ్నపత్రాలను 1.30 గంటలకు ఆయా పాఠశాలల యాజమాన్యానికి అందజేస్తారు. కానీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి ప్రశ్నపత్రాలను ముందుగానే పాఠశాలలకు చేరుస్తున్నారు. పాఠశాలల యాజమాన్యం ప్రశ్నపత్రాలను వారి విద్యార్థులకు పంపిణీ చేసి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు మాత్రమే చదువుకుని పరీక్ష రాయాలని ఇస్తున్నారు. దీని వలన ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని పలు పాఠశాలల యజమానులు ఆరోపిస్తున్నారు. శనివారం జరిగిన సోషల్–1 ప్రశ్నపత్రాన్ని రెండు రోజుల ముందే యూట్యూబ్‌లో పెట్టారు. సోమవారం జరగాల్సిన సోషల్–2 పేపర్ కూడా ముందే యూట్యూబ్‌లో ఉంచారు. గిద్దలూరులో ఓ పాఠశాల విద్యార్థులకు ముందే చేరుతున్న ప్రశ్నపత్రాలు: గిద్దలూరులో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఎస్ఏ –3 ప్రశ్న పత్రాలను రెండు రోజుల ముందే వారి విద్యార్థులకు ఇచ్చి జవాబులు నేర్చుకోవాలని చెప్పారు. ఆ విద్యార్థులు తాము చదువుకోవడంతో పాటు మరో పాఠశాల విద్యార్థులకు కూడా ప్రశ్నపత్రాలను ఇచ్చారు. ఇలా విద్యార్థులు వారి ప్రధానోపాధ్యాయునికి ప్రశ్నపత్రాలను చూపించి పలానా స్కూల్ విద్యార్థులు ఇచ్చారని, వారికి రోజూ ప్రశ్నపత్రాలు అందుతున్నాయని చెప్పారు. దీంతో అవాక్కయిన హెచ్ఎం విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు పాఠశాల కరస్పాండెంట్ అధికారికి అనుచరుడుగా ఉండటంతో పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జూనియర్ కళాశాలను నడుపుతున్న సదరు పాఠశాల యజమాని, ఇటీవలే స్కూల్ ప్రారంభించి అతని పాఠశాల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని చూపించుకునేందుకు ఇలా ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నాడని మిగిలిన పాఠశాలల యాజమానాలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఐఐటీ ఫౌండేషన్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.7 వేలు అదనంగా వసూలు చేస్తున్న సదరు పాఠశాల నిర్వాహకుడు విద్యార్థులకు చదువు చెప్పలేకున్నా ప్రశ్నపత్రాల లీక్‌తో ఉన్నత మార్కులు వచ్చేలా చేసుకుని ప్రచారం చేసి విద్యార్థులను చేర్పించుకునే యత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో ఉండటంతో కొందరు విద్యార్థులు సైతం వాటిని చూసి అవసరమైన వరకే చదువుకుని మిగిలిన పాఠ్యాంశాలను వదిలేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రశ్నపత్రాలు అరగంట ముందు ఇస్తున్నాం ఎస్ఏ–3 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల బండిళ్లను పరీక్షకు అరగంట ముందు మాత్రమే ఇస్తున్నాం. ప్రతి పాఠశాలకు ఒక పరిశీలకుడిని నియమించి మా వద్ద ఉన్న సీల్డ్ ప్రశ్నపత్రాలను ఆయనకే అందిస్తున్నాం. పరీక్ష మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాం. పేపర్ లీకయ్యే అవకాశం లేదు. పాఠశాలల యాజమాన్యాలు యూ ట్యూబ్‌లో ఉన్న ప్రశ్న పత్రాలను చూసి వారి పిల్లలకు ఇచ్చుకుంటున్నారేమో తెలియదు. -ముత్యాల సుబ్బారావు, ఎంఈఓ, గిద్దలూరు. -
నెట్ బ్యాంకింగ్‌తో జాగ్రత్త
అదమరిస్తే... నగదు గల్లంతే! సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఖాతాలో సొమ్ము ఖాళీ పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న నగదు రహిత లావాదేవీలు ఒకటో తారీకు నుంచి మొదలయ్యాయి. అయితే దీనిపై చాలామందికి సరైన అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్ల చేతచిక్కి... ఖాతాలో సొమ్మును పొగొట్టుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించి దేశీయంగా నిబంధనలు, చట్టాలు పటిష్టంగా లేవు. ఇదే సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారునుంది. నగదు రహిత లావాదేవీల విషయంలో పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నిపుణులు అందజేసిన సూచనలు కొన్ని మీ కోసం... బ్రౌజర్ సేవ్ చేయకూడదు కొన్ని వెబ్సెట్లలో నెట్ బ్యాంకింగ్ కోసం లాగిన్ డీటైల్స్ ఇవ్వగానే పాస్ ఓర్డ్ను సేవ్ చేయమంటుంది. ఓకే అని క్లిక్ చేస్తే మరోసారి లాగిన్ అయ్యే సమయంలో ఈ వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అవన్నీ బ్రౌజర్లో సేవ్ అవుతాయి. ఇలా చేస్తే మీ వివరాలు సులభంగా నేరగాళ్ల చేతికి చేరే అవకాశం ఉంది. పాస్‌వర్డ్‌ని సేవ్ చేయకుండా ఉండడం ఎంతో మంచింది. వేరే పీసీలు వద్దు నెట్ కేఫ్, ఇతరుల కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్, మొబైల్స్ నుంచి నగదు రహిత లావాదేవీలు చేయడం శ్రేయస్కరం కాదు. ప్రమాదకర వైరస్‌ను జొప్పించే వెబ్సైట్లను యాక్సిస్ చేసి ఉండవచ్చు. ఓఎస్ బ్రౌజర్ అప్డేట్లో ఉంచాలి కంప్యూటర్ ఆపరేటింగ్, సాఫ్ట్‌వేర్‌తో పాటు బ్రౌజర్ వర్షన్ అప్డేట్ ఉండేలా చూసుకోవాలి. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త వర్షన్ ఆఫ్షన్లను జోడిస్తుంటాయి. దీని వల్ల మన కంప్యూటర్లు మరింత సురక్షితంగా ఉంటాయి. లాగిన్‌లో అప్రమత్తం నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయ్యే సమయంలో కీబోర్డు నుంచి పాస్ వర్డ్‌ను టైప్ చేయకుండా బ్యాంక్ సైట్లలో కనిపించే వర్చువల్ కీబోర్డును ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. అక్కడ కనిపించే లెటర్స్ ఆధారంగా మౌస్ సాయంతో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల నేరగాళ్లు పాస్‌వర్డ్‌ను గుర్తించడం కష్టం. పైగా కీబోర్డు ద్వారా ఎంటర్ చేసే కీలను పసిగట్టే సాఫ్ట్వేర్లను సైబర్ నేరగాళ్లు సైట్ల ద్వారా కంప్యూటర్లోకి ప్రవేశ పెడుతుంటారు. అందుకే కీబోర్డును పాస్‌వర్డ్‌కు వాడకూడదని నిఫుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు ప్రత్యేక బ్రౌజర్ బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు ప్రత్యేక బ్రౌజరును వాడడం మంచిది. ఉదాహరణకు అన్నింటికి క్రోమ్ వాడే అలవాటు ఉందనుకుందాం. అప్పుడు బ్యాంకు లావాదేవీలను మాత్రం షైర్ ఫాక్స్‌లో చేయండి. ఈ బ్రౌజర్లో పాస్వర్డ్, ఇతర సమాచారం కూడా స్టోర్ అయ్యే అవకాశం లేకుండా జేబుల్ చేసి పెట్టుకోవాలి. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్ చేసే పీసీల్లో మార్కెట్లో లభిస్తున్న మంచి యాంటీ వైరస్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొంచెం ఖర్చు అయినా ఇది శ్రేయస్కరం. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. పబ్లిక్ వైఫై సాయంతో నెట్ బ్యాంకింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఓటీపీ తప్పని సరి లావాదేవీల విషయంలో టు(2) ఫ్యాక్టర్ అంథెంటిఫికేషన్ ఉంటే మంచిది. ప్రతి లావాదేవీకి ట్రాన్క్షన్ పాస్‌వర్డ్‌తో పాటు మొబైల్ ఈ మెయిల్ ఓటీపీ (ఒన్‌టైమ్ పాస్ వర్డ్) ఇస్తేనే ఓకే అయ్యేలా చూసుకోవాలి. దీని వల్ల లావాదేవీలకు పటిష్ట భధ్రత ఉంటుంది. మెయిల్ విషయంలో బ్యాంక్ లోగోతో క్రెడిట్ కార్డులు కంపెనీల పేరుతో వచ్చే ఈ మెయిల్స్‌ను క్లిక్ చేయకండి. ట్రాప్ చేస్తారు. నకిలీ సైట్లు ఇచ్చే యూజర్ ఐడీ, పాస్వర్డ్, ఇతర కార్డు సమాచారాన్ని దొంగలించి మోసం చేస్తారు. సమాచారంపై జాగ్రత్త : ఆన్లైన్లో, పబ్లిక్ ఫోరంలో, సామాజిక మాధ్యమాలలో పుట్టిన తేది, పాన్ నంబర్ ఇవ్వక పోవడం మంచింది. అవగాహన పెంచేందుకు కృషి చేయాలి ఆన్లైన్ విధానం, లావాదేవీలు చేసేంత సాంకేతిక పరిజ్ఞానం లేని వారు చాలా మంది ఉన్నారు. అంతేందుకు చాలా మంది బ్యాంకుల్లో పని చేసే అధికారులకే వారి అకౌంట్‌ను ఆన్లైన్లో ఎలా డీల్ చేయాలో తెలియదు. చాలా బ్యాంకుల ఏటీఎంలలో నకిలీ నోట్లు నిన్న మొన్నటి దాకా మనందరమూ చూశాం. ఇలాంటి వాటిని నియంత్రించేందుకే ఇప్పటి దాకా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ వాసులు, వృద్ధులు, చిన్నారులు ఆన్లైన్ లావాదేవీల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయంపై ప్రజల్లో ముందు చైతన్యం తీసుకువచ్చి మోసపోకుండా చర్యలు తీసుకోవాలి. -
మంత్రిగారా.. మజకా!
వినియోగంలో ఉన్న నెట్వర్కింగ్ కేంద్రానికి ప్రారంభోత్సవం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రాయలసీమ యూనివర్సిటీలో వినియోగంలో ఉన్న నెట్వర్కింగ్ సెంటర్‌కు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికే ఇది పనిచేస్తోంది. ఈ కేంద్రంలో వర్సిటీలోని వైఫై నెట్వర్కింగ్ సిస్టిమ్ ఉంది. దీనిని దాదాపు పది నెలల క్రితమే వైస్ చాన్సులర్ ప్రారంభోత్సవం చేశారు. అయితే మంగళవారం ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆర్‌యూలో స్కిల్ డెవలప్మెంట్పై ప్రిన్సిపాళ్లతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదో ఒక్కటి ప్రారంభించాలనే తపనతో నెట్వర్కింగ్ సెంటర్‌కు మళ్లీ ప్రారంభోత్సవం చేశారు. అలాగే 15 వందల మంది కూర్చునేందుకు వీలున్నా ఓపెయిన్ ఎయిర్ థియేటర్‌కు కూడా మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం సమయానికి తాము అక్కడ ఉన్నా పట్టించుకోలేదని అవమానం జరిగిందని ఈసీ మెంబర్ జీటీ నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. -
త్వరలో ఎన్ఐఏకు నిందితుల అప్పగింత
నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఉగ్రవాద ఆఫర్ ఇచ్చిన అరాఫత్! బెంగళూరు : ఉగ్రవాద ఆరోపణల పై అరెస్ట్ అయిన సయ్యద్ ఇస్మయిల్ అ ఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లు పోలీ సుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 2013 ఫిబ్రవరిలో జరిగిన బాంబుపేలుళ్లు, పూనెలోని జర్మన్బేకరి పేలుళ్ల వెనుక వీరి ముగ్గురి హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సోదాల్లో వీరి వద్ద దొరికిన వస్తువులు, పేలుళ్ల సమయంలో అక్కడ దొరికొని వస్తులవులతో పోల్చి చూసిన పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. బాంబుల తయారీ, రవాణా లో అఫక్ ఆదేశాలను అనుసరించి మిగి లిన ఇద్దరూ పనిచేసేవారని తెలుస్తోంది. అఫక్ బాంబుల తయారీకి సంబంధించి పాకిస్తాన్లో శిక్షణ పొందాడని పోలీసులు భావిస్తున్నారు. హోమియోపతిపై పరి జ్ఞానం ఉన్న అఫక్ యువకులను అందులోనూ ఇంగ్లిషు, ఐటీతోపాటు వైద్య విధానాలపై పరిజ్ఞానం ఉన్న వారిని ఉగ్రవాదం పై ఆకర్షితులను చేసేందుకు య త్నించేవాడని సమాచారం. ఇందుకోసం ఫేస్బుక్, ట్విట్టర్ తదితర నెట్వర్కింగ్ సైట్ల ద్వారా విద్యార్థులతో సంభాషించేవాడు. ఇతని వలలో పడిన విద్యార్థులను కలుసుకోవడానికి నేరుగా వారు చదువుతున్న విద్యాసంస్థల వద్దేకే వెళ్లేవాడు. తద్వారా మరికొంత మందిని కలుసుకోవడానికి వీలవుతుందని అఫక్ భావించేవాడు. ఇతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్, సెల్ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషించి పోలీసులు ఈ విషయా లు తెలుసుకున్నారు. ఇదిలా ఉం డగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక వీరి హస్తం ఉన్న ట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో వీరి ముగ్గురిని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కు అప్పగించాలని పోలీసులు నిర్ణయిం చారు. ఎన్ఐఏ అధికారులు త్వరలో బెం గళూరుకు వచ్చి వీరి ముగ్గురుని అదుపులోకి తీసుకోనున్నారని పో లీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా తమ కుమారులు అమాయకులని, అనవసరంగా కేసులో ఇరికిం చారని వారి తల్లిదండ్రులు బెంగళూరులో శనివారం మీడియా సమావేశంలో కన్నీరుమున్నీరుగా విలపించారు. -
కొలువు కోసం ఆన్లైన్ నెట్వర్కింగ్ గ్రూప్
ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆన్లైన్ వేదికల ద్వారానే జరుగుతోంది. కొలువుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నెట్వర్కింగ్ వ్యూహంలో భాగంగా ఆన్లైన్లో కంపెనీలు, రిక్రూట ర్లు, సంబంధిత రంగాల వ్యక్తులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. దీనివల్ల మీకు జాబ్ మార్కెట్లో వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అంతర్జాలంలో మీ స్థానం: మంచి నెట్‌వర్క్‌తో అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. మీ రంగానికి చెందిన ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ కావడం వల్ల పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు, ఉద్యోగాల భర్తీ, కెరీర్ మేనేజ్మెంట్పై అవగాహన పెరుగుతుంది. తాజా సమాచారం తెలుసుకోవచ్చు. రొటీన్ హైరింగ్ ప్రాసెస్ పట్ల రిక్రూటర్లు కూడా విసుగెత్తిపోయారు. పోస్టుల్లో వచ్చే అభ్యర్థుల అర్హతల జాబితాలను పక్కన పడేసి అంతర్జాలంలో వారి బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తున్నారు. కాబట్టి మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు మీరు కూడా ఆన్లైన్లో మీ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోండి. జాబ్ నెట్వర్కింగ్ గ్రూపుల్లో చేరండి. వాటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండి. మీ ప్రొఫెషన్‌కు చెందినవారితో కలిసి ఒక జట్టుగా మారండి. కావాల్సిన సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోండి. గ్రూప్‌తో ప్రయోజనాలెన్నో.. : జాబ్ సైట్లలో ప్రొఫైల్‌ను పోస్టు చేయడం, నెట్వర్కింగ్ గ్రూప్‌లో చేరడం.. ఈ రెండూ ఒకటేనని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి ఇవి పూర్తిగా భిన్నం. ఆన్లైన్ గ్రూప్‌లో చేరితే రిక్రూటర్లు, సహచరుల నుంచి తాజా సమాచారం తెలుస్తుంది. ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్, నియామక విధానం పట్ల అవగాహన వస్తుంది. దాని ప్రకారం సన్నద్ధం కావొచ్చు. కెరీర్‌ను మార్చుకోవడానికి కూడా ఈ గ్రూప్స్ ఉపయోగపడతాయి. ఆన్లైన్ నెట్వర్కింగ్ గ్రూప్ కూడా ఒక మౌఖిక పరీక్ష లాంటిదే. మీ అర్హతలు, అనుభవాలు, నైపుణ్యాలతో రిక్రూటర్‌ను మెప్పించగలిగితే ప్రయత్నం సఫలం కావడం ఖాయం. గ్రూప్‌లో మిమ్మల్ని మీరు ప్రభావవంతంగా వ్యక్తీకరించుకోవాలి. మీ ప్రొఫెషనల్ ప్రొఫైల్ రిక్రూటర్లను ఆకట్టుకొనేలా ఉండాలి. వ్యక్తిగత విషయాలు వద్దు : ఇతరుల అవసరం మీకే కాదు, మీ అవసరం కూడా ఇతరులకు ఉంటుంది. ఏదైనా సంస్థలో కొలువులు ఖాళీగా ఉన్నట్లు మీకు తెలిస్తే సదరు సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. అది వారికి ఉపయోగపడుతుంది. వివరాలను ఆన్లైన్లో పోస్టు చేయండి. అందరికీ అవసరమైన స్కిల్ బిల్డింగ్, కెరీర్ అడ్వాన్స్మెంట్పై ఆసక్తికర సమాచారం ఏదైనా ఇవ్వొచ్చు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేస్తూ మరో ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు నెట్వర్కింగ్ గ్రూప్‌ను వాడుకోండి. కానీ, ప్రస్తుత యాజమాన్యం గురించి చెడు ప్రచారం చేయకండి. జాబ్, కెరీర్ వంటి అంశాలకే ఈ గ్రూప్‌లను పరిమితం చేయాలి. పర్సనల్ విషయాలను పబ్లిక్‌లోకి తీసుకురావొద్దు. ఎల్లప్పుడూ పాజిటివ్ ప్రొఫెషనల్ ఇమేజ్‌నే కొనసాగించాలి. ఉద్యోగం దక్కిన తర్వాత కూడా నెట్వర్కింగ్ గ్రూప్‌తో అనుబంధం ఎప్పటిలాగే ఉండడం మంచిది. ఇది లాంగ్‌టైమ్ జాబ్ ఇన్సూరెన్స్ లాంటిది. ఈ గ్రూప్ ప్రతిదశలో మీకు అండగా నిలుస్తుంది. కెరీర్లో ఎదగడానికి తోడ ్పడుతుంది. విద్యార్థినులు విజ్ఞాన వారధులు ఆరోగ్యం నుంచి అగ్ని పరీక్షల వరకూ.. అన్నింటా విజ్ఞానానిదే ప్రధాన భాగస్వామ్యం. తరగతి గదిలో విద్యార్థి మదిలో మెదిలే ఆలోచనలే పరిశోధనలతో ఫలవంతమవుతున్నాయి. తాము కూడా ఇదే దారిలో ఉన్నామంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్(కోఠి ఉమెన్స్ కాలేజీ) విద్యార్థినులు. కళాశాల 90వ వార్షికోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పలు ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాంకేతికత, సృజనాత్మకత, బృందస్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకోవడంతోపాటు విజ్ఞానాన్ని పంచుతోంది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను విద్యార్థినులు తమ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్, కొత్త అంశాలను నేర్చుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్, నేర్పు, ఓర్పు పెంపొందుతాయంటున్నారు కాలేజీ విద్యార్థినులు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన నేడు కూడా ఉంటుందని వెల్లడించారు. ఆర్ఆర్బీ -సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ)-సికింద్రాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్: జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఎంపిక: రాత పరీక్ష ద్వారా. విభాగాల వారీగా పోస్టులు, అర్హతలు, వయోపరిమితి.. తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 19 రాతపరీక్ష తేదీలు: జూనియర్ ఇంజనీర్, డీఎంఎస్, సీఎంఏ: డిసెంబర్ 14 సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పోస్టులకు: డిసెంబర్ 21 వెబ్సైట్: http://rrbsecunderabad.nic.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్ డీఎస్సీ, టెట్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు మెథడాలజీ విభాగంలో మంచి మార్కులు సాధించడానికి ఏవిధంగా చదవాలి? - ఎల్.గాయత్రి, విద్యానగర్ టెట్, డీఎస్సీ, మోడల్ స్కూల్స్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు బోధనా పద్ధతులు సబ్జెక్టును తప్పనిసరి చేశారు. ర్యాంకు సాధనలో ఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమే కాబట్టి అభ్యర్థులు తెలుగు మెథడాలజీపై ప్రత్యేక దృష్టి సారించి చదవాలి. దీంట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఎస్జీటీ, గ్రేడ్-2 తెలుగు పండిట్స్ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ‘డీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’; బీఎడ్, టీపీటీ చేసి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసే వారు ‘బీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. టెట్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలన్నింటిలో తెలుగు మెథడాలజీ సిలబస్‌కు సంబంధించి కింద పేర్కొన్న పాఠ్యాంశాలున్నాయి. 1. భాష - వివిధ భావనలు 2. మాతృభాష బోధన - లక్ష్యాలు, స్పష్టీకరణలు 3. భాషా నైపుణ్యాలు 4. ప్రణాళికా రచన - పాఠ్య గ్రంథాలు 5. పాఠ్య బోధన ప్రక్రియలు - ఆధునిక బోధన పద్ధతులు 6. విద్యా సాంకేతిక శాస్త్రం - సహ పాఠ్య కార్యక్రమాలు 7. మూల్యాంకనం - పరీక్షలు తెలుగు మెథడాలజీ అనేది తరగతి గదిలో మాతృభాషా బోధనకు సంబంధించింది. కాబట్టి పద్య, గద్య, వ్యాకరణ, ఉపవాచక బోధనలు, వాటికి సంబంధించిన పాఠ్య పథకం, సోపాన క్రమం, తరగతి గదిలో సందర్భానుసారంగా ప్రదర్శించే బోధనోపకరణాలు, మూల్యాంకనం - పరీక్షల నిర్వహణ మొదలైన అంశాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. ఇన్పుట్స్: ఎన్.కె. మద్దిలేటి, - సీనియర్ ఫ్యాకల్టీ -
హర్యానా యువతిపై అత్యాచారం
హాలెండ్ వ్యక్తి అరెస్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పీఎస్‌లో కేసు నమోదు నెట్ చాటింగ్‌లో పరిచయం 8 నెలలుగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు దొడ్డబళ్లాపురం : హర్యానా చెందిన యువతిపై అత్యాచారం ఆపై మోసం చేసాడన్న ఆరోపణపై హాలెండ్‌కు చెందిన వ్యక్తిని ఇక్కడి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని డచ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో డెరైక్టర్‌గా పని చేస్తున్న హాలెండ్‌కు చెందిన పీటర్(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన యువతి (25) ఇతనిపై మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీటర్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి డీసీపీ వికాస్ కుమార్ మాట్లాడుతూ... హర్యానాకు చెందిన యువతికి జనవరిలో నెట్ చాటింగ్ ద్వారా పీటర్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో పీటర్ ఆమెను వివాహం చేసుకుంటానని బెంగళూరుకు రప్పించి, ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న స్విస్టౌన్ రిసార్ట్‌లో కొన్నాళ్లు సహజీవనం చేశాడు. బాధితురాలు గర్భవతి కాగా, ఆమెను అబార్షన్ చేసుకోమని బెదిరించాడని, తన ను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి 8 నెలలుగా అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పీటర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. -
రాజకీయ వి‘భజన’..!
డివిజన్ల పునర్విభజనలో నిబంధనలకు తిలోదకాలు నగర పాలక సంస్థ అధికారుల తీరుపై అనుమానాలు వరంగల్ అర్బన్ : వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా పునర్విభజన చేయాల్సిన అధికారులు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారనే ఆరోపణలు వినవస్తున్నాయి. హడవుడిగా, తప్పల తడుకగా, అస్పష్టమైన ముసాయిదాను తయారీ చేసిన వారు ఆ తర్వాత తప్పలను దిద్దుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల అదేశించిన నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్నారు. ఈనెల 8న నూతన డివిజన్ల ముసాయిదాను ప్రకటించిన అధికారులు తిరిగి రద్దు చేసినట్లు చెప్పారు. మార్నాడు ఉదయమే అనేక మార్పులతో మారోమారు ముసాయిదాను విడుదల చేయడం గమనార్హం. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 9వ డివిజన్‌ను గ్రెయిన్ మార్కెట్ పరిధి, దయానంద కాలనీ, గిరిజన హాస్టల్ గృహ సముదాయం, యాకుబ్పూరా ప్రాంతాలు రైల్వే గేట్‌కు ఒకవైపు ఉంటాయి. పుప్పాలగుట్ట, ఏసీరెడ్డి నగర్, సీపీఎం గుడిసెలు, శివనగర్ హరిజనవాడ, ఖిలావరంగల్‌లోని తూర్పుకోట, పశ్చిమకోట, కాపువాడ, వడ్లవారి వీధి, గొల్లవాడ రైల్వే గ్రేట్ అవతలి ప్రాంతంలో ఉన్నాయి. ఈ కాలనీలకు ఎక్కడా పొంతన లేదు. బల్దియా అధికారులు చెబుతున్నట్లు రోడ్డు నెట్ వర్కింగ్ కూడా లేదు. మరి డివిజన్‌ను ఏ ప్రతిపాదికన రూపకల్పన చేశారో వారికే తెలియాలి. ఈ డివిజన్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 18వ డివిజన్లోని మేదరవాడ, జేపీఎన్ రోడ్డు, కృష్ణాకాలనీ, అండర్‌బ్రిడ్జి జేపీఎన్ రోడ్డు, సీకేఎం ఆస్పత్రి ఉండగా వీటికి తోడు అండర్ రైల్వే గేట్ అవతలి ప్రాంతంలోని శివనగర్, భూపేష్‌నగర్, ఫోర్టు రోడ్డు, పెరుకవాడ, రైల్వే గేట్, పాడిమాల్లారెడ్డి కాలనీలను ఏ ప్రతిపాదికన తీసుకున్నారో తెలియదు. విలీన గ్రామమైన ఏనుమాములలో సూమారు 15వేల జనాభా ఉంది. ఈ గ్రామాన్ని 2వ డివిజన్లోని కొన్ని వార్డులను, 12వ డివిజన్లోని మరి కొన్ని రెవెన్యూ వార్డులను మిలితం చేయడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 1వ డివిజన్‌గా రూపకల్పన చేసిన ఆరేపల్లిలోని కొన్ని రెవెన్యూ బ్లాక్‌లు తీసుకోగా, 58వ డివిజన్లో మరికొన్ని బ్లాక్‌లను తీసుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. విలీన గ్రామాలకు, నగర శివారులోని కాలనీలను జోడించి ముసాయిదాలో డివిజన్లను రూపకల్పన చేశారు. గతంలో రెండుమార్లుగా జరిగిన డివిజన్ల పునర్విభజనలో రాజకీయ జోక్యం ఉందనే నేపథ్యంలో టీడీపీకి చెందిన నాయకులు హైకోర్టును అశ్రయించారు. దీంతో రెండుమార్లు పునర్విభజన ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో చేపట్టిన పునర్విభజన అస్పస్టంగా, అశాస్త్రీయంగా, ప్రజలకు అసౌకర్యంగా ఉందని, అధికార పార్టీకి చెందిన నేతల అభిప్రాయాల మేరకే డివిజన్లు తయారు చేసినట్లు వాదనలు బలంగా వినవస్తున్నాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు తమ డివిజన్లను అనూకూలంగా మార్చుకునేందుకు అధికారులను పావులుగా ఉపయోగించుకున్నారనే అరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే డివిజన్ల ముసాయిదాను పరీశీలించిన వివిధ పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు డివిజన్ల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనాలు, సలహాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన అంశం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి. -
ఐటీ సర్టిఫికేషన్స్.. కెరీర్ వెలుగులు
ఇది డిజిటల్ ప్రపంచం! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వివిధ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఐటీ వినియోగం ఎక్కువైంది. దాంతో సంబంధిత రంగాల్లో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులను అభ్యసించినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. రెగ్యులర్ డిగ్రీ కోర్సులతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులను చేస్తే మంచి ఉద్యోగాన్ని దక్కించుకున్నట్లే! వీటి ద్వారా సంబంధిత సబ్జెక్టుల్లో అవసరమైన స్కిల్స్‌ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. పరిశ్రమలు, కంపెనీలు కూడా సంబంధిత రంగంలో ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు చేసినవారికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఐటీ సర్టిఫికేషన్ కోర్సులపై ఫోకస్... స్పెషలైజేషన్ కోర్సులకనుగుణంగా ఐటీ సర్టిఫికేషన్స్‌లో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో కంప్యూటింగ్ స్కిల్స్‌ను నేర్పడమే ధ్యేయంగా ఈ కోర్సులు ఉంటున్నాయి. ఉదాహరణకు క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, మొబైల్ బేస్డ్ అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ వంటివి. ప్రధానంగా బిజినెస్ సర్టిఫికేషన్ కోర్సుల్లో.. బిజినెస్ ఎనలిటిక్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇవే కాకుండా.. నేడు అందరికీ తెలిసిన ఆన్లైన్ షాపింగ్‌లో మెళకువలు తెలుసుకోవడానికి ఈ-కామర్స్; సేవారంగంలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, డిజిటల్ మీడియా వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా తమ విద్యా నేపథ్యానికి సరితూగే కోర్సులను, ఆసక్తి, ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న ఐటీ/ఐటీ బేస్డ్ సర్టిఫికేషన్ కోర్సులను ఎంచుకోవాలి. దీంతోపాటు ఆ కోర్సులను అందిస్తున్న సంస్థల్లో పేరున్న (మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి) వాటిని ఎంచుకోవాలనేది నిపుణుల మాట. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక సర్టిఫికేషన్ కోర్సులు చేయడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ).. ఐటీఈఎస్-బీపీవో(కస్టమర్‌కేర్) కోర్సును నిర్వహిస్తోంది. దీని వ్యవధి 100 గంటలు. ఈ కోర్సుకు ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూపునకు చెందిన విద్యార్థులైనా అర్హులే. ఇంటి నుంచే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా కంప్యూటర్ బేసిక్స్, హార్డ్‌వేర్, ఆఫీస్ ఆటోమేషన్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా కామర్స్ విద్యార్థులు ఫైనాన్షియల్ అకౌంటింగ్‌పై పట్టు పెంచుకోవడానికి ఈ రంగంలో కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను అభ్యసించవచ్చు. అదేవిధంగా సైన్స్ విద్యార్థులు బయోఇన్ఫర్మేటిక్స్లోని ముఖ్య అంశాలను గురించి తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేషన్ కోర్సులు ఎంతో ఉపయుక్తం. అందించే సంస్థలు.. ఈ సర్టిఫికేషన్ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ఎన్ఐఈఎల్ఐటీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడాక్) వంటి పేరొందిన పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవి.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డీఈఐటీ), కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. ఐటీలో విద్య, పరిశోధనను పెంపొందింపజేయడం వీటి ప్రధానవిధి. కంప్యూటర్ అప్లికేషన్స్‌కు సంబంధించి దాదాపు అన్ని విభాగాల్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను ఎన్ఐఈఎల్ఐటీ, సీడాక్లు అందిస్తున్నాయి. ఐటీ సర్టిఫికెట్స్ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందుతున్నారు. కంపెనీలు కూడా నిర్దేశిత అంశంలో సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కంపెనీలు.. ఏ సంస్థలైతే మంచి సదుపాయాలతో శిక్షణ అందించి, పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతున్నాయో..వాటిని తరచుగా సందర్శించి, తమకు తగినవారిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీ నిర్దేశిత సర్టిఫికేషన్స్ నేడు ప్రతి ఒక్క రంగంలోనూ.. ఆయా అవసరాలకు అనుగుణంగా ఐటీ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. బిజినెస్ డేటా విశ్లేషణ, ఫ్యాషన్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్‌ల నుంచి సేవారంగాలైన హెల్త్‌కేర్, ఈ-కామర్స్ వరకూ.. ఐటీ రంగం విస్తరించింది. కంపెనీలు కూడా అభ్యర్థులు నిర్దేశిత అంశాల్లో, ఐటీ టూల్స్‌లో అవగాహన పొంది ఉండాలని, పూర్తిస్థాయీ పరిజ్ఞానం సాధించాలని కోరుకుంటున్నాయి. అందుకే ఐటీ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో డిమాండ్ నెలకొంది. ఫ్యాషన్ నిఫ్ట్-హైదరాబాద్.. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కోర్సును అందిస్తోంది. 10+2 ఉత్తీర్ణులు మొదటి ఏడాది కోర్సులో చేరి ఫ్యాషన్ బిజినెస్‌లో ఐటీ పాత్రను అధ్యయనం చేయొచ్చు. హెల్త్‌కేర్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. హెల్త్‌కేర్ రంగంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, ఆస్పత్రి, రోగి ఆరోగ్య నివేదికలు మొదలైనవాటి రూపకల్పనలో ఐటీ ఉపయోగపడుతుంది. ఈ రంగంలో ఉద్యోగావకాశాలను పొందడానికి సీడాక్.. ఆరు నెలల వ్యవధి ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అదేవిధంగా ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ రీసెర్చ్‌లో బయోఇన్ఫర్మేటిక్స్ది ప్రధాన పాత్ర. ఎన్ఐఈఎల్ఐటీ.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ‘ఎ’, ‘ఒ’ లెవల్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. 10+2, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కామర్స్ ఉత్తీర్ణులు, వృత్తి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి సీడాక్.. డిప్లొమా కోర్సును అందిస్తోంది. కోర్సు వ్యవధి 144 గంటలు. పవర్‌పాయింట్, ట్యాలీ, అవుట్‌లుక్, ఐఎస్ఎం అండ్ ఎంఎస్ వర్డ్ వంటివి కరిక్యులంలో ప్రధానంగా ఉంటాయి. రోజువారీ ఆఫీసు విధుల్లో భాగంగా ఈ ఐటీ టూల్స్‌ను ఉపయోగించి పనులను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అన్ని ఆదాయ, వ్యయ పట్టికలను అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా ఆన్లైన్లో పొందుపర చుకోవచ్చు. ఈ-కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉరుకుల పరుగుల జీవితంలో బయట షాపింగ్‌కు వెళ్లి కావలసిన వస్తువులు తెచ్చుకునేంత తీరికా, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్ షాపింగ్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. దుస్తులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ఫోన్లు, జ్యుయెలరీ, ఆటబొమ్మలు, గృహోపకరణాలు.. ఇలా ఒకటేమిటి..! ప్రతిదానికీ ఆన్లైన్ షాపింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడికి సమ యం ఆదా కావడంతోపాటు ఖర్చు కలిసి వస్తుంది. కంపెనీలు కూడా షాప్‌ల ఏర్పాటు, అద్దెలు, మానవ వనరుల ఖర్చులు, నిర్వహణా వ్యయం వల్ల తమ ఉత్పత్తులను ఆన్లైన్ షాపింగ్ ద్వారా విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్‌లో నిష్ణాతుల కోసం ఆయా కంపెనీలు అన్వేషిస్తున్నాయి. నేడు సంబంధిత కంపెనీల ఉత్పత్తుల ప్రచారంలో డిజిటల్ మార్కెటింగ్‌దే ప్రధాన పాత్ర. కోర్సులో భాగంగా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? సోషల్ మీడియాను డిజిటల్ మార్కెటింగ్‌కు ఎలా ఉపయోగించుకోవచ్చు? వంటివాటిని తెలియజేస్తారు. దీని ద్వారా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులు, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. తద్వారా చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సీడాక్ ఆరు నెలల వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్ ఈ-కామర్స్ కోర్సును అందిస్తోంది. దీని ద్వారా ఈ-కామర్స్‌లో ఉన్న వివిధ విభాగాల గురించి, ఈ-కామర్స్‌ను అభివృద్ధి చేయడం, సైట్ నిర్వహణా నైపుణ్యాలను తెలుసుకోవచ్చు. సాఫ్ట్వేర్ - హార్డ్‌వేర్ సర్టిఫికేషన్ కోర్సులు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) అభివృద్ధి వల్ల ఎన్నెన్నో కొత్త, కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం- ప్రతి 18 నెలలకు కొత్త కంప్యూటర్ టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. వివిధ రకాలైన కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి రకరకాల సర్టిఫికేషన్ కోర్సులున్నాయి. ఒక్కొక్క టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించాలంటే దానికి సంబంధించిన కోర్సు చేసి సర్టిఫికేట్ సంపాదిస్తే కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఈ సర్టిఫికేట్ కోర్సులన్నింటినీ దాదాపుగా ఆయా సాఫ్ట్వేర్ లేదా హార్డ్‌వేర్ కంపెనీలే ప్రోత్సహించడం గమనార్హం. ఒక్కొక్క కోర్సు.. ఒక్కొక్క సబ్జెక్టులో లేదా సాఫ్ట్వేర్ లేదా హార్డ్‌వేర్‌లో నిష్ణాతులను చేయడానికి నిర్దేశించింది. ఏ కోర్సు చేయాలన్నా బేసిక్స్‌లో మంచి అవగాహన అవసరం. ఈ కోర్సుల పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. వీటికి శిక్షణ ఎక్కడైనా తీసుకోవచ్చు. నిర్ధారిత రుసుం చెల్లించి పరీక్ష రాయొచ్చు. ఒకసారి ఏదైనా కోర్సు పరీక్షలో ఉత్తీర్ణులై సర్టిఫికేట్ సంపాదిస్తే దానికి సంబంధించిన ఉద్యోగం రావడం ఖాయం. జీతం కూడా ఎక్కువే. ప్రస్తుతం కనీసం 30 రకాల ఐటీ సర్టిఫికేట్ కోర్సులున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి 15 వరకు ఉంటాయి. ఇవన్నీ మంచి ఉద్యోగాన్ని సంపాదించిపెట్టేవే. వాటిని గురించిన వివరాలు.. హార్డ్‌వేర్ కోర్సులు సిస్కో సర్టిఫైడ్ ప్రొఫెషనల్ సిస్కో అనేది ఒక కంపెనీ. అది కంప్యూటర్ నెట్వర్కింగ్కి కావలసిన సామగ్రిని తయారుచేస్తుంది. ప్రపంచంలోనే ఇది అగ్రగామి సంస్థ. నెట్వర్కింగ్కి కావలసిన స్విచ్‌లు, రూటర్లు, పంచ్‌లు ఈ సంస్థ తయారు చేస్తుంది. కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థకి గుండె వంటిది. ఉదాహరణకు బ్యాంకులు, రైల్వేలు, కరెంటు బిల్లులు కట్టడంలాంటివి అన్నీ కూడా సిస్కో తయారుచేసిన వస్తువులపైనే. వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి చాలామంది నిపుణులు అవసరం. అంతేకాకుండా ఈ రంగంలో నానాటికీ వాడేవాటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుండటం వల్ల నిపుణుల కొరత కూడా ఎక్కువ. అందువల్ల సీసీఎన్ఏ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు, మంచి జీతం పొందే అవకాశాలు పుష్కలం. సెక్యూరిటీ ప్రొఫెషనల్ ప్రధానమైన కోర్సు ఇది. అటు హార్డవేర్, ఇటు సాఫ్ట్వేర్ రెండింటికీ ఉపయుక్తం. మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా జరగాలని కోరుకుంటాం. ఉదాహరణకు మనం ఆన్లైన్లో డబ్బు ఒక బ్యాంకు ఖాతా నుంచి ఇంకొక బ్యాంకు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అందులో ఏదైనా పొరపాటు జరిగి ఇంకొకరి ఖాతాలో జమ అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికోసం కొన్ని పద్ధతులు, సాఫ్ట్వేర్ డిజైన్ ఉన్నాయి. అందులో నిష్ణాతులను తయారుచేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. సెక్యూరిటీ అనేది ఎప్పటికీ అవసరమైనది కాబట్టి, భవిష్యత్తులో దాని అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఈ కోర్సు చేసినవారికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. సాఫ్ట్వేర్ కోర్సులు ...మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇందులో దాదాపు 15 రకాల కోర్సులున్నాయి. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ తయారుచేసిన సాఫ్ట్వేర్లలో నిపుణతను పెంచడానికీ, పరీక్షించడానికీ ఉద్దేశించినవి. వీటిలో ముఖ్యమైనది మైక్రోసాఫ్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ డెవలపర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఐదింటిలో ఏ కోర్సులో సర్టిఫికేటు పొందినా.. మంచి ఉద్యోగం, జీతం ఖాయం. ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇది ప్రధానంగా డేటాబేస్‌కి సంబంధించిన కోర్సు. ఇందులో ముఖ్యమైనవి రెండు. మొదటిది ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా ప్రోగ్రామర్. రెండోది, ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్.ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా ప్రోగ్రామర్: ఇది జావా ప్రోగ్రామింగ్ గురించి మంచి అవగాహనను కలిగిస్తుంది. ఒరాకిల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: ఒరాకిల్ డేటాబేస్‌లో మంచి ప్రావీణ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగావకాశాల్లో 20 వరకు వీటిల్లోనే ఉంటున్నాయి. లైనక్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే.. ఇది కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన సాఫ్ట్వేర్. దీనిలో నైపుణ్యం పొందడానికి కూడా చాలా కోర్సులున్నాయి. ఇందులో ముఖ్యమైనది లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. పెద్దపెద్ద కంప్యూటర్ వ్యవస్థలన్నీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం మీదే పనిచేస్తాయి. ఉదాహరణకు విమానయాన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, అన్ని సెక్యూరిటీ వ్యవస్థలు లైనక్స్ పైనే పనిచేస్తాయి. అందువల్ల ఈ కోర్సు చేసినవారికి ఉద్యోగాలు అపారం. అంతేకాకుండా మంచి జీతం కూడా పొందొచ్చు. జావా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ జావా అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజీ. ఇది ఇంటర్నెట్ వినియోగంలోకి రావడానికి ప్రత్యేకంగా తయారుచేసిన భాష. ఇది ఫ్లాట్‌ఫారం ఇండిపెండెంట్. అంటే.. ఏ కంప్యూటర్ మీదనైనా దానితో పనిచేయించవచ్చు. అదేవిధంగా ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ కూడా. అందువల్ల ఇంటర్నెట్ ఉపయోగించి చేసే ఏ కంప్యూటర్ అప్లికేషనైనా సరే ఇది తప్పనిసరి. అందువల్ల జావా అనేది అన్ని విశ్వవిద్యాలయాల బీటెక్ (సీఎస్ఈ)పాఠ్యాంశాలలో విధిగా ఉంటుంది. విద్యార్థులు మరింత లోతైన పరిజ్ఞానం పొందాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులవ్వాల్సిందే. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం ఎంత కష్టమో, ఈ జావా రాకపోతే కంప్యూటర్ కంపెనీల్లో పనిచేయడం కూడా అంతే కష్టం. అందువల్ల ఈ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువ. ప్రత్యేకమైన కోర్సులు.. ఎస్ఏపీ ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయిన కోర్సు. దీనిని ఈఆర్పీ (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) అని కూడా అంటారు. ఒక ఇండస్ట్రీలో ఉన్న అన్ని విభాగాలను అనుసంధానిస్తూ అన్నింటినీ కంప్యూటరీకరణ చేయడంగా దీనిని పేర్కొనవచ్చు. ఇందులో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఫైనాన్స్, ప్రాజెక్ట్స్, హ్యూమన్ రిసోర్సెస్లాంటివి. ఇందులో ఏ ఒక్కదాంట్లోనైనా ప్రావీణ్యం సంపాదిస్తే చాలు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని కోర్సుల్లో కష్టమైనదీ, బాగా జీతం వచ్చేదీ ఇదే! టెస్టింగ్ టెక్ ప్రతి సాఫ్ట్వేర్ తయారీలోనూ ఆఖరి భాగం టెస్టింగ్. సాఫ్ట్వేర్ తయారుచేసిన తర్వాత దానిని కూలంకషంగా పరీక్షించి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇలా పరీక్షించడానికి కూడా కొన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజీలు ఉన్నాయి. వాటినే టెస్టింగ్ టూల్స్ అంటారు. వీటిని నేర్చుకుంటే ఈ ఫీల్డులో మంచి ఉద్యోగం పొందొచ్చు. మెయిన్‌ఫ్రేమ్ ట్రైనింగ్ పర్సనల్ కంప్యూటర్లు లేని రోజుల్లో కంప్యూటర్లు చక్కబెట్టే వ్యవహారాలన్నీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్‌తోనే జరిగేవి. ఇప్పటికీ చాలా వ్యవహారాలకు వీటిని వాడుతున్నారు. వీటిని ఉపయోగించడానికి, నిర్వహించడానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ప్రస్తుతం వీటిని స్పేస్ టెక్నాలజీ వంటి ప్రముఖమైన వాటిల్లో వినియోగిస్తున్నారు. వీటిలో ఉద్యోగాలు బాగున్నా ఎదుగుదల తక్కువ. ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా ఉన్నాయి. అవన్నీ ఉద్యోగం చేస్తూ మరింత ఉన్నత పదవులు అధిరోహించడానికి ఉపయోగపడేవి. ఈ కోర్సులన్నింటికీ మంచి ఉద్యోగావకాశాలు ఉన్న మాట వాస్తవమే అయినా ఈ కోర్సుల సర్టిఫికెట్‌తోపాటు బీఈ/బీటెక్ డిగ్రీ కూడా ఉండాలి. అంతేకాకుండా బేసిక్స్ మీద అవగాహన ఉండాలి. ఇవి ఉంటే వీటిల్లో ఏ కోర్సు సర్టిఫికేట్ పొందినా మంచి ఉద్యోగం, భవిష్యత్తు, జీతం సొంతమవుతుంది. కోర్సులు.. అందిస్తున్న సంస్థలు.. కోర్సులు: ఒ లెవల్ వ్యవధి: 13 నెలలు బి లెవల్ వ్యవధి: 14 నెలలు హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ వ్యవధి: 15 నెలలు ఎ లెవల్ వ్యవధి: 24 నెలలు ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ వ్యవధి: ఆరు నెలలు సంస్థ: ఎన్ఐఈఎల్ఐటీ వెబ్సైట్: ఠీఠీఠీ.జ్ఛ్టీఛిజిఛీ.జీ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈ-కామర్స్ వ్యవధి: 144 గంటలు ఈఎల్ఎస్ఐ డిజైన్ హెల్త్‌కేర్ ఇన్ఫర్మేటిక్స్ ఆటోమేషన్ అండ్ ఎస్సీఏడీఏ సిస్టమ్స్ వ్యవధి: ఆరు నెలలు, సంస్థ: సీడాక్ వెబ్సైట్: www.cdac.in కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వ్యవధి: 16 నెలలు సంస్థ: నిఫ్ట్-హైదరాబాద్ వెబ్సైట్: www.nift.ac.in ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వ్యవధి: 160 గంటలు ఒరాకిల్ 10జీ: పీఎల్/ఎస్‌క్యూఎల్ వ్యవధి: 40 గంటలు సంస్థ: ఎస్క్యూఎల్ఎస్టీఏఆర్ వెబ్సైట్: www.sqlstar.com సీసీఎన్ఏ సెక్యూరిటీ సంస్థ: సిస్కో సిస్టమ్స్ వెబ్సైట్: www.cisco.com ఎంసీఎస్‌ఏ సంస్థ: మైక్రోసాఫ్ట్ వెబ్సైట్: www.microsoft.com సీఎస్ఎస్ఏ సంస్థ: డెల్ వెబ్సైట్: http://accessories.dell.com ఒరాకిల్ సోలారిస్ 10 సర్టిఫైడ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ సంస్థ: ఒరాకిల్ వెబ్సైట్: www.oracle.com ఐబీఎం సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ - టివోలి మానిటరింగ్ వీ6.2.3 సంస్థ: ఐబీఎం వెబ్సైట్: www.ibm.com గూగుల్ యాప్స్ అడ్మినిస్ట్రేటర్ సంస్థ: గూగుల్ వెబ్సైట్: http://certification.googleapps.com