నెట్‌ బ్యాంకింగ్‌తో జాగ్రత్త | Beware of Internet Banking | Sakshi
Sakshi News home page

నెట్‌ బ్యాంకింగ్‌తో జాగ్రత్త

Published Mon, Dec 5 2016 10:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నెట్‌ బ్యాంకింగ్‌తో జాగ్రత్త - Sakshi

నెట్‌ బ్యాంకింగ్‌తో జాగ్రత్త

  • అదమరిస్తే... నగదు గల్లంతే!
  • సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కితే ఖాతాలో సొమ్ము ఖాళీ
  •  పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న నగదు రహిత లావాదేవీలు ఒకటో తారీకు నుంచి మొదలయ్యాయి. అయితే దీనిపై చాలామందికి సరైన అవగాహన లేకపోవడంతో సైబర్‌ నేరగాళ్ల చేతచిక్కి... ఖాతాలో సొమ్మును పొగొట్టుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించి దేశీయంగా నిబంధనలు, చట్టాలు పటిష్టంగా లేవు. ఇదే సైబర్‌ నేరగాళ్ల పాలిట వరంగా మారునుంది. నగదు రహిత లావాదేవీల విషయంలో పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నిపుణులు అందజేసిన సూచనలు కొన్ని మీ కోసం...

    బ్రౌజర్‌ సేవ్‌ చేయకూడదు

    కొన్ని వెబ్‌సెట్లలో నెట్‌ బ్యాంకింగ్‌ కోసం లాగిన్‌ డీటైల్స్‌ ఇవ్వగానే పాస్‌ ఓర్డ్‌ను సేవ్‌ చేయమంటుంది. ఓకే అని క్లిక్‌ చేస్తే మరోసారి లాగిన్‌ అయ్యే సమయంలో ఈ వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అవన్నీ బ్రౌజర్‌లో సేవ్‌ అవుతాయి. ఇలా చేస్తే మీ వివరాలు సులభంగా నేరగాళ్ల చేతికి చేరే అవకాశం ఉంది. పాస్‌వర్డ్‌ని సేవ్‌ చేయకుండా ఉండడం ఎంతో మంచింది.

    వేరే పీసీలు వద్దు

    నెట్‌ కేఫ్, ఇతరుల కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్, మొబైల్స్‌ నుంచి నగదు రహిత లావాదేవీలు చేయడం శ్రేయస్కరం కాదు. ప్రమాదకర వైరస్‌ను జొప్పించే వెబ్‌సైట్‌లను యాక్సిస్‌ చేసి ఉండవచ్చు. ఓఎస్‌ బ్రౌజర్‌ అప్‌డేట్‌లో ఉంచాలి

    కంప్యూటర్‌ ఆపరేటింగ్, సాఫ్ట్‌వేర్‌తో పాటు బ్రౌజర్‌ వర్షన్‌ అప్‌డేట్‌ ఉండేలా చూసుకోవాలి. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త వర్షన్‌ ఆఫ్షన్‌లను జోడిస్తుంటాయి. దీని వల్ల మన కంప్యూటర్లు మరింత సురక్షితంగా ఉంటాయి.

    లాగిన్‌లో అప్రమత్తం

    నెట్‌ బ్యాంకింగ్‌లో లాగిన్‌ అయ్యే సమయంలో కీబోర్డు నుంచి పాస్‌ వర్డ్‌ను టైప్‌ చేయకుండా బ్యాంక్‌ సైట్‌లలో కనిపించే వర్చువల్‌ కీబోర్డును ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. అక్కడ కనిపించే లెటర్స్‌ ఆధారంగా మౌస్‌ సాయంతో పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల నేరగాళ్లు పాస్‌వర్డ్‌ను గుర్తించడం కష్టం. పైగా కీబోర్డు ద్వారా ఎంటర్‌ చేసే కీలను పసిగట్టే సాఫ్ట్‌వేర్‌లను సైబర్‌ నేరగాళ్లు సైట్ల ద్వారా కంప్యూటర్‌లోకి ప్రవేశ పెడుతుంటారు. అందుకే కీబోర్డును పాస్‌వర్డ్‌కు వాడకూడదని నిఫుణులు హెచ్చరిస్తున్నారు.

    బ్యాంకు లావాదేవీలకు ప్రత్యేక బ్రౌజర్‌

    బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు ప్రత్యేక బ్రౌజరును వాడడం మంచిది. ఉదాహరణకు  అన్నింటికి క్రోమ్‌ వాడే అలవాటు ఉందనుకుందాం. అప్పుడు బ్యాంకు లావాదేవీలను మాత్రం షైర్‌ ఫాక్స్‌లో చేయండి. ఈ బ్రౌజర్‌లో పాస్‌వర్డ్, ఇతర సమాచారం కూడా స్టోర్‌ అయ్యే అవకాశం లేకుండా  జేబుల్‌ చేసి పెట్టుకోవాలి. 

    యాంటీ వైరస్‌ సాఫ్ట్‌ వేర్‌

    కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఆన్‌లైన్‌ చేసే పీసీల్లో మార్కెట్‌లో లభిస్తున్న మంచి యాంటీ వైరస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. కొంచెం ఖర్చు అయినా ఇది శ్రేయస్కరం. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. పబ్లిక్‌ వైఫై సాయంతో నెట్‌ బ్యాంకింగ్‌ చేయడం చాలా ప్రమాదకరం.

    ఓటీపీ తప్పని సరి

    లావాదేవీల విషయంలో టు(2) ఫ్యాక్టర్‌ అంథెంటిఫికేషన్‌ ఉంటే మంచిది. ప్రతి లావాదేవీకి ట్రాన్‌క‌్షన్‌ పాస్‌వర్డ్‌తో పాటు మొబైల్‌ ఈ మెయిల్‌ ఓటీపీ (ఒన్‌టైమ్‌ పాస్‌ వర్డ్‌) ఇస్తేనే ఓకే అయ్యేలా చూసుకోవాలి. దీని వల్ల లావాదేవీలకు పటిష్ట భధ్రత ఉంటుంది.

    మెయిల్‌ విషయంలో

    బ్యాంక్‌ లోగోతో క్రెడిట్‌ కార్డులు కంపెనీల పేరుతో వచ్చే ఈ మెయిల్స్‌ను క్లిక్‌ చేయకండి. ట్రాప్‌ చేస్తారు. నకిలీ సైట్లు ఇచ్చే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర కార్డు సమాచారాన్ని దొంగలించి మోసం చేస్తారు.

    సమాచారంపై జాగ్రత్త : ఆన్‌లైన్‌లో, పబ్లిక్‌ ఫోరంలో, సామాజిక మాధ్యమాలలో పుట్టిన తేది, పాన్‌ నంబర్‌ ఇవ్వక పోవడం మంచింది.

    అవగాహన పెంచేందుకు కృషి చేయాలి

    ఆన్‌లైన్‌ విధానం, లావాదేవీలు చేసేంత సాంకేతిక పరిజ్ఞానం లేని వారు చాలా మంది ఉన్నారు. అంతేందుకు చాలా మంది బ్యాంకుల్లో పని చేసే అధికారులకే వారి అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా డీల్‌ చేయాలో తెలియదు. చాలా బ్యాంకుల ఏటీఎంలలో నకిలీ నోట్లు నిన్న మొన్నటి దాకా మనందరమూ చూశాం. ఇలాంటి వాటిని నియంత్రించేందుకే ఇప్పటి దాకా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు.  ఈ పరిస్థితుల్లో గ్రామీణ వాసులు, వృద్ధులు, చిన్నారులు ఆన్‌లైన్‌ లావాదేవీల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయంపై ప్రజల్లో ముందు చైతన్యం తీసుకువచ్చి మోసపోకుండా చర్యలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement