ముసద్దీలాల్ జ్యువెలరీ ఎండీకి ఊరట | Relief for Musaddilals Jewellers MD kailash chand gupta | Sakshi
Sakshi News home page

ముసద్దీలాల్ జ్యువెలరీ ఎండీకి ఊరట

Published Wed, Dec 28 2016 5:45 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

ముసద్దీలాల్ జ్యువెలరీ ఎండీకి ఊరట

ముసద్దీలాల్ జ్యువెలరీ ఎండీకి ఊరట

హైదరాబాద్: ముసద్దీలాల్ జ్యువెల్లరీ యజమాని కైలాస్ చంద్‌ గుప్తాకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన బుధవారం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కైలాస్‌ చంద్‌ గుప్తాను అరెస్ట్‌ చేయొద్దని సీసీఎస్‌ పోలీసుల్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి రెండో తేదీకి వాయిదా వేసింది.

కాగా నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కైలాస్‌ చంద్‌ గుప్తా  పెద్ద మొత్తంలో నగదును బ్యాంకులో జమ చేశారు. ముసద్దీలాల్ జ్యువెలర్స్, దాని అనుబంధ సంస్థల పేరిట సుమారు 100 కోట్ల డిపాజిట్లు చేసినట్లు గుర్తించిన ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో  సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌ రంగంలోకి దిగారు. అయితే కోర్టు ఆదేశాలతో సీసీఎస్‌ పోలీసులు ఎలాంటి అరెస్ట్‌ లు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement