అమెరికా అందాల రాణి సావీ షీల్డ్స్
అట్లాంటిక్ సిటీ: మిస్ అమెరికా 2017 అందాల రాణి కిరీటాన్ని ఆర్కాన్సాస్ కు చెందిన సావీ షీల్డ్స్ దక్కించుకుంది. అట్లాంటిక్ నగరంలో జరిగిన తుది పోటీలో 51 మందిని వెనక్కునెట్టి 21 ఏళ్ల సావీ షీల్డ్స్ టైటిల్ గెలిచింది. ఆమెకు గతేడాది విజేత బెటీ కాంట్రెల్ కిరీటాన్ని అలంకరించింది.
మిస్ సౌత్ కరోలినా రాచెల్ వ్యాట్ ఫస్ట్ రన్నర్ గా నిలిచింది. మిస్ న్యూయార్క్ కామిల్లె సిమ్స్ రెండో రన్నరప్ స్థానం దక్కించుకుంది. తొలిసారిగా స్వలింగ సంపర్కులను ఈ పోటీకి అనుమతించారు. తాను లెస్బియన్ అని ప్రకటించిన మిస్ కెంటకీ 2011 జాన్ ట్రెంట్ టాప్ టెన్ లో నిలిచింది.
అర్కాన్సాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ చదువుతున్న సావీ షీల్డ్స్ భవిష్యత్ లో మ్యూజియంలో పనిచేయాలనుకుంటున్నానని, కాలేజీ స్థాయిలో బోధన చేపట్టాలనుకుంటున్నట్టు వెల్లడించింది.